ETV Bharat / sports

కివీస్​​ పర్యటనకు జట్టు ఎంపిక నేడే... హార్దిక్​కు​ కష్టమే! - india cricket news

న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును సెలక్టర్లు నేడు(ఆదివారం) ప్రకటించనున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్‌ పాండ్య పునరాగమనం ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా-ఏ ప్రాక్టీస్​ మ్యాచ్​ల కోసం న్యూజిలాండ్​కు​ వెళ్లే జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్​నెస్​ టెస్టులో విఫలమయ్యాడు ఈ యువ ఆల్​రౌండర్​​.

Hardik Pandya fails fitness tests, Doubtful to India tour of New Zealand, 2020
కివీస్​​ పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడే... హార్దిక్​ కష్టమే!
author img

By

Published : Jan 12, 2020, 5:16 AM IST

ప్రపంచకప్​ తర్వాత వెస్టిండీస్​ గడ్డపై మాత్రమే తలపడిన టీమిండియా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​, వెస్టిండీస్​తో జరిగిన పలు సిరీస్​లను స్వదేశంలోనే ఆడింది. ఈ ఏడాది ఆడిన మొదటి టీ20 సిరీస్​.. ఇక్కడే జరిగింది. అయితే ఈ ఏడాది అక్టోబర్​లో జరిగే టీ20 ప్రపంచకప్​ కోసం సిద్ధమవుతున్న 'మెన్​ ఇన్​ బ్లూ'... తొలిసారి విదేశీ గడ్డపైనా కాలు మోపనుంది. జనవరి 24 నుంచి దాదాపు ఆరు వారాలు న్యూజిలాండ్​లో పర్యటించనుంది. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో... మొత్తం ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడతుంది భారత జట్టు.

కివీస్‌తో ఎనిమిది పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడనుంది భారత్​. ఈ నేపథ్యంలో సెలక్టర్లు 15 మంది బదులు 16 లేదా 17 మందితో జట్టును ప్రకటించాలని భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్​ ముందు యువకులకు ఎక్కువ అవకాశాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భారత్‌-ఏ జట్టు.. షాడో పర్యటన కోసం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. అంటే ఈ మ్యాచ్​ల్లో ఆడిన యువ ఆటగాళ్లను అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు.

హార్దిక్​ పూర్తిగా ఔట్!

న్యూజిలాండ్‌-ఏ జట్టుపై ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే హార్దిక్‌ పాండ్యను సీనియర్‌ జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఈ సిరీస్​కు వెళ్లేముందు ఫిట్​నెస్​ టెస్టులో ఫెయిలయ్యాడు ఈ యువ ఆల్​రౌండర్​. ఇతడి స్థానంలో విజయ్​ శంకర్​ ఎంపికయ్యాడు. భారత్‌-ఏ సిరీస్‌ ఈనెల 26న ముగుస్తుంది. అక్టోబర్​లో టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు కోసం ఇతడు ఎక్కువగా శ్రమించాల్సి ఉంది. ఫిట్​నెస్​ టెస్టు కంటే యోయో టెస్టు కష్టమైనది కాబట్టి ఇతడి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది వన్డే ప్రపంచకప్​ తర్వాత వెన్నుగాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి జట్టుకు దూరమయ్యాడు హార్దిక్​.

Hardik Pandya fails fitness tests, Doubtful to India tour of New Zealand, 2020
హార్దిక్​ పాండ్య

జాదవ్​కు అదృష్టమే రక్ష

వన్డేల్లో మాత్రమే ఆడుతున్న కేదార్‌ జాదవ్‌ది అయోమయ పరిస్థతి. వచ్చిన ఒకట్రెండు అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేదు. ఈ సారి చోటు దక్కితే అదృష్టమే. న్యూజిలాండ్‌లోని కఠిన పరిస్థితులు, పిచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే అద్భుతమైన టెక్నిక్‌ ఉన్న అజింక్య రహానేను వన్డేలకు ఎంపిక చేయొచ్చు. టీ20ల్లో టీమిండియా ప్రదర్శనను బట్టే అతడి ఎంపిక ఉంటుంది.

పవర్‌ హిట్టింగ్‌ సామర్థ్యం ఉన్న ముంబయి ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదు, ఆరు స్థానాల్లో ఉపయోగించుకొనేందుకు అర్హుడే. జాతీయ జట్టులో చోటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. అతడితో పాటు సంజు శాంసన్‌ భారత్‌-ఏ జట్టులో ఉన్నాడు.

సూర్యకుమార్​-జాదవ్​

రాహుల్​ ఖాయమేనా?

టెస్టుల్లో రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్లు. మూడో ఓపెనర్‌ విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ చక్కని ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు సిరీసుల్లో శుభ్‌మన్‌ గిల్‌ ఆ పాత్ర పోషించాడు. వీరి ఎంపిక ఆసక్తికరంగా మారింది. అవసరమని భావిస్తే మూడో స్పిన్నర్‌గా కుల్దీప్​ను ఎంపిక చేయొచ్చు. అక్కడి పేస్‌ పరిస్థితులును అనుసరించి జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మతో పాటు ఐదో పేసర్‌గా నవదీప్‌ సైనీకి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదు.

శుభ్​మన్​ గిల్​-కేఎల్​ రాహుల్​

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ కోసం సన్నాహాల్లో టీ20 సిరీస్​లకు రోహిత్​-కోహ్లీలలో ఒక్కొక్కరికీ ఒక్కోసారి విశ్రాంతినిస్తున్నారు సెలక్టర్లు. ఇటీవల లంక సిరీస్​కు రోహిత్​కు చోటివ్వలేదు. కోహ్లీ స్వదేశంతో జరిగే తర్వాతి టీ20 సిరీస్​కు దూరమవుతాయి. అయితే విదేశంలో జరుగుతున్న టోర్నీ కావడం కివీస్​ పర్యటనకు ఇద్దరూ తుది జట్టులోకి రానున్నారు.

AP Video Delivery Log - 1700 GMT News
Saturday, 11 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1658: Taiwan Election AP Clients Only 4248853
Taiwan's Tsai thanks supporters, Han concedes
AP-APTN-1636: Ukraine Airline Crash 2 AP Clients Only 4248841
Airline condemns Iran for not closing airspace
AP-APTN-1617: Russia Putin Merkel AP Clients Only 4248850
Merkel: Ukraine plane crash 'a big mistake'
AP-APTN-1606: Syria Airstrike AP Clients Only 4248849
Syrian warplanes carry out airstrikes in Idlib
AP-APTN-1540: India Protest 2 AP Clients Only 4248845
Torch wielding protesters rally in India's Assam
AP-APTN-1512: Croatia Fire 2 No Access Croatia 4248844
PM visits site of Croatia care home fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.