న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డ టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా ఇతడు జిమ్‌లో బరువులెత్తుతూ కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. గాయం తర్వాత తొలిసారి అతడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. కాగా హిట్‌మ్యాన్‌ను వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్రోల్ చేశాడు. "ఇందుకోసం కేవలం 40 కిలోలేనా..? కమాన్" అంటూ రిప్లై ఇచ్చాడు.
భజ్జీ కామెంట్‌కు రోహిత్ గౌరవంగా బదులిచ్చాడు. "గాయపడ్డ తర్వాత బరువులెత్తడం ఇదే తొలిసారి. అందుకే ఇలా.." అని అన్నాడు. ఏదేమైనప్పటికీ హర్భజన్ వ్యాఖ్యలకు కొందరు నవ్వుకుంటే మరికొందరు ఘాటుగా స్పందించారు.
"పాజీ, అతడు వాంఖడే నుంచి చిన్నస్వామికి బంతిని పంపించగలడు", "40 కిలోలే ఎత్తినా అతడు బంతిని స్టాండ్స్‌లోకి తరలించగలడు", "ఇప్పుడతను బరువులెత్తడంలో డబుల్ సెంచరీ చేయాలనా మీ ఉద్దేశం? రోహిత్ గాయపడ్డాడు", "అతడు 100 నుంచి 200కు 32 బంతుల్లో చేరుకోగలడు. నెమ్మదిగా ఆరంభిస్తాడు" అని నెటిజన్లు కామెంట్లు చేశారు. రోహిత్ త్వరగా కోలుకొని మైదానంలో అలరించాలని కోరుకున్నారు.
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో రోహిత్ పిక్కకు గాయమైంది. ఫలితంగా అతడు మైదానం నుంచి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వన్డే, టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">