ETV Bharat / sports

'శ్రీశాంత్​ను కొట్టినందుకు హర్భజన్ చాలా బాధపడ్డాడు' - 'శ్రీశాంత్​ను కొట్టినందుకు హర్భజన్ చాలా బాధపడ్డాడు'

ఐపీఎల్​లో శ్రీశాంత్​ను చెంపదెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్ తీవ్ర​ పశ్చాత్తాపానికి గురయ్యాడని చెప్పాడు ఆసీస్ ఫస్ట్​ క్లాస్​ క్రికెటర్ డొమినిక్​.

author img

By

Published : Apr 11, 2020, 5:59 PM IST

ఐపీఎల్ తొలి సీజన్​లో భారత క్రికెటర్లు హర్భజన్, శ్రీశాంత్​ల మధ్య జరిగిన గొడవను అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ముంబయి-పంజాబ్​ మధ్య లీగ్​ మ్యాచ్​లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే శ్రీశాంత్​ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత భజ్జీ చాలా బాధపడ్డాడని చెప్పాడు ఆసీస్ క్రికెటర్ డొమినిక్ థోర్న్​లే. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు.

"ఈ ఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అకస్మాతుగా భజ్జీ.. శ్రీశాంత్​ను కొట్టడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత హర్భజన్ ఔటై వచ్చి, డగౌట్​లో నా పక్కనే కూర్చొన్నాడు. అప్పుడు అతడేం మాట్లడలేదు. అనంతరం హోటల్​కు వచ్చిన హర్భజన్.. తాను అలా చేసుండకూడదని బాధపడ్డాడు"

-డొమినిక్, ఆసీస్ క్రికెటర్

ఆ ఏడాది ముంబయి ఇండియన్స్​ తరఫున ఆరు మ్యాచులు ఆడిన డొమినిక్..​ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాళీల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.

ఐపీఎల్​ తొలి పది సీజన్లు ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు హర్భజన్. ఆ తర్వాత చెన్నైకు మారాడు. శ్రీశాంత్.. రాజస్థాన్ రాయల్స్​ తరఫున ఆడుతూ మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడి నిషేధానికి గురయ్యాడు.

Harbhajan Singh regrets slapping Sreesanth in IPL 2008, says Dominic Thornely
డొమినిక్ థోర్న్​లే

ఇదీ చూడండి : ఆన్​లైన్​ శిక్షణ ఇస్తూ ధోనీ, అశ్విన్ బిజీ బిజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.