ETV Bharat / sports

ఐపీఎల్​కు దూరంగా హర్భజన్​ సింగ్​? - latest harbajan singh ipl news updates

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీనియర్ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ ఈ ఏడాది ఐపీఎల్​ నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే, వాటిలో వాస్తవం లేదని ఫ్రాంచైజీ అధికారిక వర్గాలు తెలిపాయి.

Harbhajan Singh
హర్బజన్​ సింగ్
author img

By

Published : Sep 1, 2020, 8:15 PM IST

Updated : Sep 1, 2020, 8:31 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ ట్రోఫీని ఎలాగైనా దక్కించుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్​ కింగ్స్ కూడా ఒకటి. అయితే, సీఎస్కే ఆటగాళ్లకు కరోనా సోకడం, కొంతమంది లీగ్​ నుంచి వైదొలగడం జట్టును కష్టాల్లోకి నెట్టినట్లైంది. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు రైనా. స్పిన్నర్​ హర్భజన్ సింగ్ ఇప్పటికీ దుబాయ్​కి చేరుకోలేదు. ఈ క్రమంలోనే భజ్జీ టోర్నమెంటు నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లని ఫ్రాంచైజీ అధికారిక వర్గాలు తెలిపాయి. కానీ హర్భజన్ నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

Harbhajan Singh
హర్బజన్​ సింగ్

ఈ విషయంపై హర్భజన్​ను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. మరోవైపు 2020 ఐపీఎల్​లో రైనాను కోల్పోతున్నట్లు ఆగస్టు 29న సీఎస్కే ట్వీట్​ చేయడం.. ఫ్యాన్స్​ను నిరాశకు గురి చేసింది. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా లీగ్​ ప్రారంభం కానుంది. అబుదాబి, షార్జా, దుబాయ్​ నగరాలు ఇందుకు వేదిక కానున్నాయి.

Last Updated : Sep 1, 2020, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.