ETV Bharat / sports

భార్యలతో హెయిర్​కట్​ చేయించుకోవడం సాహసమే! - భార్యలతో హెయిర్​కట్​ చేయించుకోవటం సాహసమే!

లాక్​డౌన్​ కారణంగా భార్యతోనే ఇంట్లో హెయిర్​కట్​ చేయించుకొని నవ్వులపాలయ్యాడు ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ రాబర్ట్​ కీ. అతడి భార్య హెయిర్​ ట్రిమ్​ చేసిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకోగా.. దీనిపై పలువురు నెటిజన్లు నవ్వుతూ స్పందించారు.

Getting hair cut with wives is an adventure!: Robert Key
భార్యలతో హెయిర్​కట్​ చేయించుకోవటం సాహసమే!
author img

By

Published : Apr 18, 2020, 8:06 AM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇంట్లో భార్యలతో హెయిర్​ కట్​ చేయించుకుంటున్నారు కొంతమంది క్రీడాకారులు. వారిలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఉండగా.. తాజాగా ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ రాబర్ట్​ కీ ఆ జాబితాలో చేరాడు. భార్యలతో హెయిర్​కట్​ చేయించుకోవటం ఓ సాహసమేనని అంటున్నాడు. దానికి సంబంధించిన ఓ చిత్రాన్ని ట్విట్టర్​లో షేర్​ చేసుకున్నాడు.

ఇక అనుమతించను

ఆ చిత్రంలో రాబర్ట్​ తల వెనుక భాగంలో ట్రిమ్మర్​తో జుట్టును కట్ చేసి ఉంది. "హెయిర్​కట్​కు మరోసారి నా భార్య అనుమతించను" అని ఆ పోస్ట్​లో రాసుకొచ్చాడు రాబర్ట్​. అతడి భార్య ఫ్లూర్​కీ ట్విట్టర్​లో దీనిపై క్షమాపణ కోరగా.. క్రికెటర్​ సామ్​ బిల్లింగ్స్​తో పాటు పలువురు నెటిజన్లు నవ్వుతూ స్పందించారు.

కరోనా లాక్​డౌన్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురుషుల సెలూన్​లూ మూతపడ్డాయి. దీంతో వారి భార్యలతో హెయిర్​కట్​ చేయించుకుంటున్నారు కొంత మంది సెలబ్రిటీలు. ఇటీవలె టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మతో హెయిర్​ కట్​ చేయించుకున్న వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నాడు.

ఇదీ చూడండి.. ఫోర్ కొట్టు కోహ్లీ.. అనుష్క చమత్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.