ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజాలు జెఫ్రీ, ఆండ్రూ స్ట్రాస్లు ఇంగ్లాండ్ ప్రతిష్టాత్మక 'నైట్ హుడ్' పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కోసం వీరిద్దరి పేర్లను సూచించారు బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే.
జెఫ్రీ 108 టెస్టులు ఆడి 8వేల 114 పరుగులు చేశాడు. 1964 నుంచి 1982 వరకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. క్రికెట్ చరిత్రలో నలుగురు మాత్రమే 151 ఫస్ట్‌క్లాస్ సెంచరీలు సాధించారు. వారిలో జెఫ్రీ ఒకడు. ఇంగ్లాండ్ తరఫున 36 వన్డేలు ఆడాడు.
ఇంగ్లాండ్ జట్టు రెండు యాషెస్ విజయాలు అందుకోవడంలో స్టాస్ ప్రముఖ పాత్ర పోషించాడు. అంతేకాకుండా టెస్టు ర్యాంకింగ్స్‌లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. స్ట్రాస్ ఇంగ్లాండ్ తరఫున 127 వన్డేలు, 100 టెస్టులు ఆడాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వతా ఇంగ్లాండ్ పురుషుల జట్టుకు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ ప్రపంచకప్‌ను గెలవడంలో స్ట్రాస్ తెరవెనుక పాత్ర పోషించాడు.
ఇదీ చూడండి...