ETV Bharat / sports

వేలంలో గావస్కర్​ టోపీ​, రవిశాస్త్రి​ కిట్​ - The Sir Geoffrey Boycott Collection

ప్రముఖ సంస్థ క్రిస్టీస్.. భారత మాజీ ఆటగాళ్లు గతంలో ఉపయోగించిన వస్తువులను వేలం వేయనుంది. ఇందులో గావస్కర్ టోపీ, రవిశాస్త్రి కిట్​ ఉన్నాయి. వీటికి భారతీయ క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పందన రావొచ్చని సంస్థ ఆశిస్తోంది.

Gavaskar's cap, Shastri's coaching kit at Christie's cricketing memorabilia sales
క్రిస్టీస్​ వేలంలో గవాస్కర్​ క్యాప్​, రవిశాస్త్రి కోచింగ్​ కిట్​
author img

By

Published : Nov 1, 2020, 1:20 PM IST

దిగ్గజ క్రికెటర్లు సునీల్​ గవాస్కర్​ టోపీ​, రవిశాస్త్రి కోచింగ్​ కిట్​లను త్వరలో వేలం వేయనున్నారు. సర్​ జియోఫ్రే బాయ్​కాట్​ కలెక్షన్స్​, టీ20 ఛారిటీ క్రికెట్​ పేరిట క్రిస్టీస్ సంస్థ వీటిని అక్టోబర్​ 27న వేలం వేయనునుంది.

క్రిస్టీస్​ ఏం చేస్తుంది?

ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలను సేకరించే క్రిస్టీస్​​ సంస్థ.. వాటిని వేలం వేస్తుంది. ఇప్పుడు జరగబోయే వేలంలో 1971 ఇంగ్లండ్​ పర్యటనలో సునీల్​ గావస్కర్​ ధరించిన టోపీని ఉంచారు. దీని కోసం భారత క్రికెట్​ అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడే అవకాశముందని క్రిస్టీస్​ ప్రపంచ అధ్యక్షుడు ఫిల్క్​నెన్​ అభిప్రాయపడ్డారు.

1977 ఆగస్టు​లో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ఇంగ్లాండ్​ ఆటగాడు బాయ్​కాట్​ వందో సెంచరీ చేశాడు. ఆ సందర్భంలో బాయ్​కాట్​ ఉపయోగించిన బ్యాట్​ను​ కూడా వేలం వేయనుంది క్రిస్టీస్​. దీని ద్వారా రూ.28.95 లక్షల నుంచి రూ.48.25లక్షలు వస్తాయని భావిస్తోంది. వీటితో పాటే అత్యంత విలువైన క్రికెట్​ జ్ఞాపకాలను అభిమానుల కోసం వేలం రూపేణా తీసుకురానుంది. తద్వారా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సేవల కోసం వినియోగించనుంది.

ఇదీ చూడండి:లంక ప్రీమియర్​ లీగ్​లో​ ఇర్ఫాన్.. కాంట్రాక్ట్​పై సంతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.