టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. హిట్‌మ్యాన్‌లా బ్యాటింగ్ చేయాలని ఉందని అన్నాడు. తాను ఆడేటప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు.
"వన్డే, టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ అద్భుతం. నాకు అలానే ఆడాలని ఉంది. కానీ అప్పట్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఆడలేకపోయాను. నా తర్వాతి తరం ఆటగాళ్ల నైపుణ్యం ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాను"
-గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గావస్కర్ రికార్డు సాధించాడు. ఈ ఫార్మాట్లో 125 మ్యాచులు ఆడగా, అందులో 34 సెంచరీలు ఉన్నాయి. 108 వన్డేలాడి 3,092 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ వన్డేల్లో 9,115 పరుగులతో పాటు 27 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 2773 పరుగులు చేసి.. టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 32 మ్యాచుల్లో 2141 పరుగులు సాధించాడు.
ఇది చూడండి ప్రేక్షకులు లేకుండా క్రికెట్ కష్టమే: స్మిత్