ETV Bharat / sports

చాక్లెట్లతో కరోనా వారియర్స్​కు 'దాదా' సంఘీభావం

కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న వైద్యులకు సంఘీభావం తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. వారికి కృతజ్ఞత తెలుపుతూ ప్రముఖ చాక్లెట్ల తయారీ కంపెనీ మార్స్​ వ్రింగ్లీ చాక్లెట్లను పంపిణీ చేశారు. వైద్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

author img

By

Published : Jun 20, 2020, 6:07 PM IST

ganguly
గంగూలీ

కరోనాపై నిరంతర పోరాటం చేస్తోన్న యోధుల్లో.. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది​ ముందున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు కొవిడ్-19​ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా వీరి కృషికి సంఘీభావం తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

ఇందుకోసం ప్రముఖ చాకెట్ల ఉత్పత్తి సంస్థ మార్స్​ వ్రింగ్లీతో చేతులు కలిపారు దాదా. ఆ సంస్థ తయారు చేసిన చాక్లెట్లను పశ్చిమ బంగా వైద్య ఫోరం సభ్యులకు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా యోధులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. దీంతో పాటు కోల్​కతాలోని మెడికా సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొవిడ్​ విభాగంలో పనిచేసే వైద్యబృందానికి ఈ చాక్లెట్లను పంచారు.

మార్స్ వ్రింగ్లీ సంస్థ తయారుచేసే చాక్లెట్లు, ఇతర తినుబండారాల ఆకృతులు.. విభిన్నంగా, చూడగానే ఆహ్లాదకరంగా అనిపించేలా ఉంటాయి. ప్రతిఒక్కరూ తమ ఆహార ఉత్పత్తి చూడగానే సరదాగా నవ్వుకునేలా చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.

ఇది చూడండి : ఏళ్లపాటు యువరాజ్​ సింగ్​కు నిద్రలేని రాత్రులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.