ETV Bharat / sports

'అప్పటి వరకు కరోనాను భరించాల్సిందే' - సౌరభ్ గంగూలీ తాజా వార్తలు

ఈ ఏడాది చివరి వరకు కరోనా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ తెలిపాడు. ఇటీవలే ఆన్​లైన్ వీడియో​ సెషన్​లో పాల్గొన్న దాదా.. మహమ్మారిపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

Ganguly feels COVID-19 not going anywhere at least till end of 2020; but IPL set to move out
'ఈ ఏడాది చివరి వరకు కరోనాను భరించల్సిందే'
author img

By

Published : Jul 7, 2020, 11:05 AM IST

కరోనాను ఈ ఏడాది చివరికి లేదా, 2021 ప్రారంభం వరకు భరించాల్సి ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​తో ఆన్​లైన్​ సెషన్​లో మాట్లాడిన గంగూలీ.. కరోనా పరిస్థితులపై అనేక విశేషాలు పంచుకున్నాడు.

"రానున్న నాలుగు నెలలు కాస్త కఠినంగా ఉంటాయని అనుకుంటున్నా. కచ్చితంగా మనం భరించి తీరాల్సిందే. వచ్చే ఏడాదికి పరిస్థితులన్నీ సాధారణ స్థితికి రావాలి. టీకా వచ్చే వరకు వేచి చూడక తప్పదు. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవ్వరూ ఈ మహమ్మారి బారిన పడాలని అనుకోవట్లేదు. ఆటలో లాలాజలం వినియోగం ఒక సమస్య. టీకా వచ్చిన తర్వాతే అన్నీ సాధారణ స్థితికి వస్తాయి."

-సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

దాదా మాటలను బట్టి చూస్తే వచ్చే ఏడాది వరకు భారత్​లో క్రికెట్​ నిర్వహణ కష్టతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్​ టోర్నీపై.. బీసీసీఐ నిర్ణయంలో సందిగ్ధత నెలకొంది. లీగ్​ను స్వదేశంలోనే జరపాలని బోర్డు భావిస్తున్నప్పటికీ.. భారత్​లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలోనే టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు శ్రీలంక, యూఏఈ దేశాలు ముందుకొచ్చాయి. తాజాగా, న్యూజిలాండ్​ కూడా తమ దేశంలో లీగ్​ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:నవంబరు నుంచి ఖాళీ స్టేడియాల్లో ఐఎస్ఎల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.