ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను థర్డ్ అంపైర్ ప్రకటించే పద్ధతిని త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది ఐసీసీ. వచ్చే 6 నెలల్లో కొన్ని సిరీస్‌ల్లో ఈ నూతన పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మైదానంలోని అంపైర్లు(ఆన్‌ఫీల్డ్ అంపైర్లు).. బౌలర్ క్రీజు బయట అడుగేసినప్పుడు నోబాల్‌ను ప్రకటించే అధికారం ఉండదు.
బౌలర్ బంతిని వేసిన కొన్ని సెకన్లలో అతడి ఫ్రంట్‌ఫుట్ దృశ్యాన్ని మూడో అంపైర్ (టీవీ అంపైర్) ముందు ఉంచుతారు. ఒకవేళ నోబాల్ పడితే అతడు వెంటనే మైదానం అంపైర్‌కు మైక్రోఫోన్ ద్వారా చెబుతాడు. ఆ తర్వత ఆన్‌ఫీల్డ్ అంపైర్లు అది నోబాల్ అని ప్రకటిస్తారు.
గతంలోనూ...
2016లో ఇంగ్లండ్-పాక్ మధ్య జరిగిన సిరీస్‌లో ఈ విధానం అమలు చేసినా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసింది ఐసీసీ. తాజాగా క్రికెట్ కమిటీ సలహా మేరకు మరోసారి ఈపద్ధతిని అమలు చేయనున్నట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ వెల్లడించాడు.
ఇవీ చూడండి...ఆఖరి టీ-20 ఇండియాదే.. సిరీస్ క్లీన్‌స్వీప్