ETV Bharat / sports

టెస్టుల్లో ఫలితమే ప్రధానం: లారా - క్రికెటర్​

నాలుగు రోజుల టెస్టు విషయంలో ఐసీసీ తీసుకొచ్చిన ప్రతిపాదనపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు విముఖతతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ బ్రియన్​ లారా దీనిపై స్పందించాడు. టెస్టు ఎన్ని రోజులైనా ఫలితం రావడమే ముఖ్యమని తెలిపాడు.

Former West Indies cricketer Brian Lara respond on four day and nigh test match proposal
'టెస్టు ఎన్నిరోజులన్నది ముఖ్యం కాదు.. ఫలితమే ప్రధానం'
author img

By

Published : Mar 10, 2020, 10:40 AM IST

టెస్టుల నిడివి గురించి ఎటువంటి ఆందోళన లేదని, అయితే ప్రతి మ్యాచ్‌కు ఫలితాలు రావడమే తనకి ముఖ్యమని వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌ బ్రియన్‌ లారా అన్నాడు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదన చేసింది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ విషయమై లారా స్పందించాడు.

"నా దృష్టిలో ఫలితం ఎలా వస్తుందనే అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే ఫలితంపైనే అందరికీ ఆసక్తి ఉంటుంది. టెస్టుల నిడివి నాలుగు రోజులా లేదా అయిదు రోజులా అనేది విషయం కాదు. ప్రతి మ్యాచ్‌కు ఏదో రూపంలో ముగింపు కచ్చితంగా ఉంటుంది. ప్రజలు తొలి రోజు, ఆఖరి రోజుపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కొందరు అయిదు రోజులు క్రికెట్‌ ఆడాలని భావిస్తారు. అయితే ఆ సందర్భాల్లో కూడా అన్నిసార్లు ఫలితాలు రావు"

బ్రియన్​ లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్​

డే/నైట్‌ టెస్టు అనేది ఆకర్షణగా నిలుస్తుందని.. అయితే అదే సుదీర్ఘ ఫార్మాట్‌ను భవిష్యత్తు తరాలకు తీసుకువెళ్లదని తెలిపాడు లారా. నేటితరం టెస్టులపై పెద్దగా శ్రద్ధ చూపించట్లేదని.. కానీ, మునపటిలా టెస్టులపై ఆసక్తి తీసుకురావాల్సి ఉందని లారా అన్నాడు. అయితే మంచి టెస్టు మ్యాచ్‌ను చూస్తే అందరూ ఎంతగానో ఆస్వాదిస్తారని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం లారా వరల్డ్‌ సిరీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ టోర్నీని నిర్వహిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.