ఐర్లాండ్ మాజీ క్రికెటర్ రాయ్ టోరెన్స్(72) తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు మాజీలు, వర్ధమాన క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
టోరెన్స్.. 1948లో జన్మించారు. 1966-1984 వరకు కెరీర్లో 30 మ్యాచులు ఆడి 77 వికెట్లు తీశారు. 2000లో ఐరిష్ క్రికెట్ యూనియన్‌కు అధ్యక్షుడిగానూ సేవలందించారు.
ఇదీ చూడండి: గబ్బా: 'సర్కస్‌లో జోకర్స్లా ఉంది మా పరిస్థితి'