టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌పై హరియాణా హిసార్‌లోని హన్సి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 జూన్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టా లైవ్ చాటింగ్‌లో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.
హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది, దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సాన్.. ఈ మాజీ ఆల్‌రౌండర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
"కుల, మత, రంగు, లింగం విషయంలో నేనెలాంటి అసమానతలు చూపలేదని భావిస్తున్నాను. ప్రజల సంక్షేమం కోసం నా జీవితాన్ని గడిపాను. ఇకపై అలాగే గడుపుతాను. నేను నా స్నేహితులతో చర్చిస్తున్నప్పుడు తప్పుగా మాట్లాడాను. ఒక భారతీయుడిగా ఎవరి మనోభావాలను కించపరిచినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను" అని యువీ గతంలోనే క్షమాపణలు చెప్పాడు.
ఇదీ చదవండి: 'తొలి టెస్టులో ఇంగ్లాండ్ సారథి పొరపాటు చేశాడు'