దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సర్వసభ్య వార్షికోత్సవ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రాజన్ మంచందతో పాటు మరికొంత మంది పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘర్షణను చూసి అక్కడికొచ్చిన వారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
This is also Indian cricket. Hooligans running our game. Each of these people are a disgrace. @BCCI @SGanguly99 @JayShah This is the AGM of DDCA. I don’t know if there can be any worse. Need action against these people with immediate effect. pic.twitter.com/qKONsPUW4N
— Boria Majumdar (@BoriaMajumdar) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is also Indian cricket. Hooligans running our game. Each of these people are a disgrace. @BCCI @SGanguly99 @JayShah This is the AGM of DDCA. I don’t know if there can be any worse. Need action against these people with immediate effect. pic.twitter.com/qKONsPUW4N
— Boria Majumdar (@BoriaMajumdar) December 29, 2019This is also Indian cricket. Hooligans running our game. Each of these people are a disgrace. @BCCI @SGanguly99 @JayShah This is the AGM of DDCA. I don’t know if there can be any worse. Need action against these people with immediate effect. pic.twitter.com/qKONsPUW4N
— Boria Majumdar (@BoriaMajumdar) December 29, 2019
ఈ ఘర్షణకు సంబంధించి స్పష్టమైన సమాచారం తెలియనప్పటికీ సభ్యుల మధ్య ఒక ప్రతిపాదన విషయంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకోలేదనేదే కారణమని తెలుస్తోంది. విచిత్రమేమంటే సమావేశం ముగిశాక డీడీసీఏ అధికారిక ట్విట్టర్‌లో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసింది. గొడవకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించకుండా ఈ వార్షిక సమావేశంలో పాల్గొన్న డీడీసీఏ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్ మదన్‌లాల్ ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దాదా ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గౌతమ్ గంభీర్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆసీస్ క్రికెటర్ పీటర్ సిడిల్ రిటైర్మెంట్