ETV Bharat / sports

అలాంటి వ్యాఖ్యలు ఇదేం తొలిసారి కాదు: అశ్విన్

author img

By

Published : Jan 10, 2021, 3:54 PM IST

జాతి వివక్ష వ్యాఖ్యలను తాము ఎదుర్కొవడం ఇదే తొలిసారి కాదని టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అన్నాడు. గతంలోనూ జాతివిద్వేషాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని నిర్వాహకులకు సూచించాడు.

Faced racism in Sydney earlier too, needs to be dealt with iron fist: Ashwin
'జాత్యహంకార ఘటన ఇదే తొలిసారి కాదు'

సిడ్నీ మైదానంలో ప్రేక్షకుల నుంచి జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొవడం ఇదేమీ తొలిసారి కాదని చెప్పాడు టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గతంలోనూ ఇలాంటివి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజున టీమ్​ఇండియాపై పలువురు ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలపై వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత నిర్వహకులు జోక్యం చేసుకుని వారిని స్టేడియం నుంచి బయటకు పంపారు. దీనిపై అశ్విన్​ స్పందించాడు.

"సిడ్నీలో గతంలోనూ జాతివిద్వేషానికి గురయ్యాం. దీనిపై కఠినంగా వ్యవహరించాలి. జాతివివక్ష, చులకనక చూడటం లాంటివి 2011లో నాకు అవగాహన లేవు. ఈ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వడం బాధాకరం."

-రవిచంద్రన్ అశ్విన్, భారత స్పిన్నర్

జాతి వివక్ష వ్యాఖ్యలకు నిరసన తెలిపి.. అంపైర్లకు ఫిర్యాదు చేశారు భారత క్రికెటర్లు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు దాదాపు 10నిమిషాల పాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. సదరు అల్లరి మూకలను భద్రతా సిబ్బంది మైదానం నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంపై టీమ్​ఇండియాకు క్షమాపణ చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా.

ఇదీ చూడండి: ఒకే రోజు.. 309 పరుగులు.. టీమ్​ఇండియా లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.