ETV Bharat / sports

మూడో టెస్టులో ఆధిక్యంలో ఇంగ్లాండ్.. తడబడిన పాక్ - జాక్​ క్రాలే 267 రన్స్​

పాకిస్థాన్​తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్​, బౌలింగ్​లో నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థిని చిక్కుల్లో పడేసింది. 583 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత బరిలో దిగిన పాక్​ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

England's Crawley hits double ton before Anderson rocks Pakistan on day 2
నిర్ణయాత్మక టెస్టులో రాణిస్తున్న ఇంగ్లిష్​ జట్టు
author img

By

Published : Aug 23, 2020, 8:23 AM IST

సౌథాంప్టన్​ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ పరుగుల వరదను సృష్టించింది. ఇంగ్లీష్​ బ్యాట్స్​మెన్ జాక్​ క్రాలే డబుల్​ సెంచరీతో విజృంభించగా.. వికెట్ కీపర్​ జాస్​ బట్లర్​ 152 రన్స్​తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా 8 వికెట్లు కోల్పోయి 583 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్​ చేసిన ఆతిథ్య జట్టు బౌలింగ్​లోనూ రాణించింది. 24 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టింది.

గతంలో ఎప్పుడూ బౌలింగ్​ చేయని పాక్​ బౌలర్​ ఫవాద్ ఆలం.. బట్లర్​ వికెట్​ను సాధించాడు. ఆ తర్వాత బరిలో దిగిన క్రిస్​ వోక్స్​, డోమ్​ బెస్​, స్టువర్ట్​ బ్రాడ్​లు కలిపి కేవలం 53 పరుగులను నమోదు చేశారు. దీంతో 583 పరుగుల వద్ద ఇన్నింగ్స్​ను డిక్లేర్​ చేస్తున్నట్లు​ ప్రకటించాడు ఇంగ్లాండ్ కెప్టెన్​ జో రూట్​.

ఆ తర్వాత బ్యాటింగ్​ బరిలో దిగిన పాక్​ ఆటగాళ్లు షాన్​ మసూద్​ (4), అబిద్​ అలీ (1), బాబర్ అజామ్​ (11) వెంటవెంటనే ఔటయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి​ మూడు వికెట్ల నష్టానికి 24 పరుగులు నమోదు చేసింది పాక్.

మూడు టెస్టుల సిరీస్​లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా రెండో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి మ్యాచ్​లోనూ విజయం సాధించి సిరీస్​ను​ దక్కించుకోవాలని చూస్తోంది రూట్​సేన.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోరు:

ఇంగ్లాండ్​ : 583/8 (డిక్లేర్డ్​) (క్రాలే 267, బట్లర్​ 152; (ఫవాద్​ ఆలం 2/46)

పాకిస్థాన్​ : 24/3 (బాబర్​ 11, అజార్​ 4 (నాటౌట్​)); (అండర్సన్​ 3/13)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.