ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. ప్రస్తుత టెస్టు సారథి అజార్ అలీకి తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.
-
Bhayya stay strong 💪🏻 in shaa allah we will bounce back Pakistan zindabad @AzharAli_ pic.twitter.com/vstVNmI4Ki
— Sarfaraz Ahmed (@SarfarazA_54) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bhayya stay strong 💪🏻 in shaa allah we will bounce back Pakistan zindabad @AzharAli_ pic.twitter.com/vstVNmI4Ki
— Sarfaraz Ahmed (@SarfarazA_54) August 10, 2020Bhayya stay strong 💪🏻 in shaa allah we will bounce back Pakistan zindabad @AzharAli_ pic.twitter.com/vstVNmI4Ki
— Sarfaraz Ahmed (@SarfarazA_54) August 10, 2020
"భయ్యా.. మీరు బలంగా ఉండండి. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది" అని ట్వీట్ చేశాడు సర్ఫరాజ్.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. వోక్స్ (84 నాటౌట్), బట్లర్ (75) పోరాడడం వల్ల నాలుగో రోజు 277 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్ జట్టు ఛేదించింది. యాసిర్ షా మాయాజాలానికి ఓ దశలో ఇంగ్లాండ్ 117 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. వోక్స్, బట్లర్ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
అంతకుముందు పాకిస్థాన్ (ఓవర్‌నైట్ 137/8) రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 326 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 219 పరుగులకే ఆలౌటైంది. వోక్స్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.