సౌథాంప్టన్‌లో పాకిస్థాన్ తడబడింది. తొలి టెస్టులో ఓడినా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జట్టు రెండో టెస్టును పేలవంగా ఆరంభించింది. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ల ధాటికి ఇబ్బంది పడ్డ పాక్.. గురువారం తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అబిద్ అలీ (60; 111 బంతుల్లో 74) అర్ధశతకం సాధించాడు. తొలి టెస్టు సెంచరీ హీరో, ఓపెనర్ షాన్ మసూద్ (1) విఫలమయ్యాడు. వెటరన్ పేసర్ అండర్సన్ రెండు కీలక వికెట్లతో పాకిస్థాన్‌ను దెబ్బతీశాడు. వర్షం ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించింది. తొలి రోజు కేవలం 45.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి బాబర్ అజామ్ (25)తో పాటు మహ్మద్ రిజ్వాన్ (4) క్రీజులో ఉన్నాడు.
విజృంభించిన అండర్సన్
ఉదయం ఎండ కాస్తుండగా.. పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి మబ్బులు పట్టాయి. మాంచెస్టర్‌లో అంతగా రాణించలేకపోయిన ఫాస్ట్ బౌలర్ అండర్సన్ (2/35) ఈసారి.. పాక్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే షాన్ మసూద్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కొనసాగించాడు. ఇంగ్లాండ్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం వల్ల అబిద్ రెండు సార్లు బతికిపోయాడు. అబిద్‌తో పాటు కెప్టెన్ అజహర్ అలీ (20) నిలవగా వర్షం కారణంగా జట్లు కాస్త త్వరగా లంచ్‌కు వెళ్లే సమయానికి పాకిస్థాన్ వికెట్ నష్టానికి 62 పరుగులు సాధించింది. లంచ్ తర్వాత అజహర్ అలీని అండర్సన్ ఔట్ చేశాడు.
-
YES JIMMY! 🙌
— England Cricket (@englandcricket) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Live Scorecard & Clips: https://t.co/yjhVDqBbVN#ENGvPAK pic.twitter.com/f9jpsmJhl8
">YES JIMMY! 🙌
— England Cricket (@englandcricket) August 13, 2020
Live Scorecard & Clips: https://t.co/yjhVDqBbVN#ENGvPAK pic.twitter.com/f9jpsmJhl8YES JIMMY! 🙌
— England Cricket (@englandcricket) August 13, 2020
Live Scorecard & Clips: https://t.co/yjhVDqBbVN#ENGvPAK pic.twitter.com/f9jpsmJhl8
ఆ తర్వాత బాబర్ అజామ్‌తో కలిసి అబిద్ జట్టు స్కోరును 100 దాటించాడు. కానీ ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి పాక్ విలవిల్లాడింది. 18 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకుని 120/5తో నిలిచింది. కరన్ బౌలింగ్‌లో అబిద్ క్యాచ్ ఔటవగా.. షఫిక్ (5)ను బ్రాడ్, ఫవాద్ అలమ్‌ను వోక్స్ పెవిలియన్ బాట పట్టించారు. ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్.. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ స్థానంలో ఫవాద్ అలమ్‌ను తీసుకుంది. 11 ఏళ్ల విరామం తర్వాత ఫవాద్‌కు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం విశేషం.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్:
షాన్ మసూద్ ఎల్బీ (బి) అండర్సన్ 1; అబిద్ అలీ (సి) బర్న్స్ (బి) కరన్ 60; అజహర్ అలీ (సి) బర్న్స్ (బి) అండర్సన్ 20; బాబర్ అజామ్ బ్యాటింగ్ 25; అసద్ షఫిక్ (సి) సిబ్లే (బి) బ్రాడ్ 5; ఫవాద్ అలమ్ ఎల్బీ (బి) వోక్స్ 0; మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (45.4 ఓవర్లలో) 126/5
వికెట్ల పతనం:
1-6, 2-78, 3-102, 4-117, 5-120; బౌలింగ్: అండర్సన్ 15-3-35-2; బ్రాడ్ 13-4-31-1; సామ్ కరన్ 10-2-23-1; వోక్స్ 7.4-1-26-1