ETV Bharat / sports

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు - end vs ind ser quarantine

ఈ నెల 27న ఇంగ్లాండ్​ జట్టు భారత్​కు రానుంది. అనంతరం కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుని ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాల్సి ఉంటుంది. ఫలితంగా వీరికి తొలి టెస్టుకు ముందు ఆట ప్రాక్టీస్​ చేయడానికి మూడు రోజులు మాత్రమే సమయం దొరకనుంది.

england
ఇంగ్లాండ్​
author img

By

Published : Jan 25, 2021, 12:46 PM IST

జనవరి 27న భారత్​ పర్యటనకు రానున్న ఇంగ్లాండ్​ జట్టు.. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుని ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది. ఫలితంగా చెన్నై వేదికగా ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న తొలి టెస్టుకు ముందు.. ప్రత్యర్థి జట్టుకు మూడు రోజులు మాత్రమే శిక్షణ సమయం ఉంటుంది. క్వారంటైన్​ కోసం చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో బయోబబుల్​ను ఏర్పాటు చేసింది బీసీసీఐ.

ప్రస్తుతం ఇంగ్లాండ్​-శ్రీలంక మధ్య సిరీస్​ 26న ముగుస్తుంది. అయితే ఈ సిరీస్​లో భాగం అవ్వని ఇంగ్లాండ్​ క్రికెటర్లు​ బెన్‌ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్‌ ఇప్పటికే ఆదివారం రాత్రి భారత్​కు చేరుకుని క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. ఫలితంగా.. వీరికి ఆరు రోజుల క్వారంటైన్​ను ముగియగానే ప్రాక్టీస్​ చేయడానికి ఐదురోజుల సమయం దొరుకుతుంది.

భారత్​ ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్​ జట్టుకు కేటాయించిన హోటల్​లోనే 27వ తేదీన క్వారంటైన్​లోకి వెళ్లిపోతారు. ఇరు జట్లకు ఈ ఆరు రోజుల క్వారంటైన్​ సమయంలో మూడు సార్లు వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నెగటివ్​గా తేలితేనే ఆటగాళ్లు మ్యాచులో పాల్గొంటారు. లాక్​డౌన్​ తర్వాత భారత గడ్డపై జరగనున్న తొలి క్రికెట్​ నేపథ్యంలో అనేక జాగ్రత్తల నడుమ సమరానికి రంగం సిద్ధం చేసింది బీసీసీఐ. సిరీస్​ నిర్వహణకు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోంది.

షెడ్యూల్​ ఇదే

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

ఇదీ చూడండి : ఈ నెల 27 నుంచి క్వారంటైన్​లోకి భారత్​-ఇంగ్లాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.