యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాభవం మూటగట్టుకున్న ఇంగ్లాండ్ రెండో టెస్టులోనూ సత్తాచాటలేకపోయింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకే ఆలౌటైంది ఆతిథ్య జట్టు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఇంగ్లీష్ జట్టును కట్టడి చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ బర్న్స్(53), జానీ బెయిర్ స్టో (52) మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కంగారూ బౌలర్లలో కమిన్స్ హాజిల్‌వుడ్, లయన్ తలో మూడు వికెట్లతో రాణించారు.
-
Stumps!
— ICC (@ICC) August 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia close Day 1 on 30/1, Cameron Bancroft and Usman Khawaja the not out batsmen.#Ashes pic.twitter.com/zaoznJQfSe
">Stumps!
— ICC (@ICC) August 15, 2019
Australia close Day 1 on 30/1, Cameron Bancroft and Usman Khawaja the not out batsmen.#Ashes pic.twitter.com/zaoznJQfSeStumps!
— ICC (@ICC) August 15, 2019
Australia close Day 1 on 30/1, Cameron Bancroft and Usman Khawaja the not out batsmen.#Ashes pic.twitter.com/zaoznJQfSe
ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బాన్‌క్రాఫ్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు రాయ్. కాసేపటికే కెప్టెన్ రూట్(14)నూ పెవిలియన్ చేర్చాడు హాజిల్‌వుడ్. ఈ పరిస్థితుల్లో డిన్లై(30) - బర్న్స్(53) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 64 పరుగులు జోడించారు.
పరిస్థితి కుదుట పడుతుందనుకున్న తరుణంలో మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. హాజిల్‌వుడ్‌కు కమిన్స్, లయన్ తోడవ్వడంతో 138కే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. చివర్లో బెయిర్ స్టో, క్రిస్ వోక్స్(30) క్రీజులో పాతుకుపోవడం వల్ల ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.
-
Fifty for Jonny Bairstow!
— ICC (@ICC) August 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Big innings from the England No.7.
Follow live 👇 https://t.co/oYrODCm7qX pic.twitter.com/OGCtUl0790
">Fifty for Jonny Bairstow!
— ICC (@ICC) August 15, 2019
Big innings from the England No.7.
Follow live 👇 https://t.co/oYrODCm7qX pic.twitter.com/OGCtUl0790Fifty for Jonny Bairstow!
— ICC (@ICC) August 15, 2019
Big innings from the England No.7.
Follow live 👇 https://t.co/oYrODCm7qX pic.twitter.com/OGCtUl0790
అనంతరం.. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓ వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయినప్పటికీ బాన్‌క్రాఫ్ట్, ఖవాజా నిలకడగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ జరగలేదు.
ఇది చదవండి: 'గేల్.. ఓ స్నేహశీలి.. మంచి వ్యక్తి'