టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ అరుదైన ఘనత సాధించింది. సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు లక్షల పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో టెస్టు ఈ రికార్డుకు వేదికైంది. మొత్తంగా 1022 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించింది ఇంగ్లీష్ జట్టు.
830 టెస్టుల్లో 4,32,706 పరుగులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. 540 మ్యాచ్ల్లో 2,73,518 పరుగులతో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జో రూట్ (25), ఒల్లీ పోప్ (22) క్రీజులో ఉన్నారు.
ఇవీ చూడండి.. 'కోహ్లీ, రోహిత్లను చూసి నేర్చుకున్నా'