ETV Bharat / sports

అంతర్జాతీయ కెరీర్​కు ఇయాన్ బెల్ వీడ్కోలు

author img

By

Published : Sep 5, 2020, 11:02 PM IST

ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ అంతర్జాతీయ కెరీర్​కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లీష్ జట్టు తరఫున 161 వన్డేలు, 118 టెస్టులు ఆడాడు బెల్.

అంతర్జాతీయ కెరీర్​కు ఇయాన్ బెల్ వీడ్కోలు
అంతర్జాతీయ కెరీర్​కు ఇయాన్ బెల్ వీడ్కోలు

ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ (38) క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లీష్ జట్టు తరఫున 161 వన్డేలు, 118 టెస్టులు ఆడిన ఇతడు స్టైలిష్ బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా బెల్​ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దేశవాళీలో వార్విక్​షైర్​కు ప్రాతినిధ్యం వహించిన ఇతడు ఆ జట్టుతోనే ఎక్కువ సమయం గడిపాడు.

ఇయాన్ బెల్
ఇయాన్ బెల్

మొత్తంగా బెల్​.. టెస్టుల్లో 7,727 పరుగులు (22 సెంచరీలు), వన్డేల్లో 5,416 పరుగులు చేశాడు. 2015లోనే వన్డే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన బెల్.. టెస్టులపై ఫోకస్ చేద్దామనుకున్నాడు. కానీ అదే ఏడాది తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. నవంబర్ 2015లో చివరిసారిగా టెస్టు ఆడిన అతడికి మళ్లీ అవకాశం రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.