ETV Bharat / sports

స్పిన్నర్ల విజృంభణ- 112 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​

author img

By

Published : Feb 24, 2021, 6:21 PM IST

Updated : Feb 24, 2021, 6:51 PM IST

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతున్న పింక్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ జట్టు 112 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్​ జాక్​ క్రావ్లే అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్​ 6, అశ్విన్​ 3 వికెట్లు తీసుకున్నారు.

england all out in third test
విజృంభించిన స్పిన్నర్లు- 112 పరుగులకు ఇంగ్లాండ్​ ఆలౌట్​

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పర్యటక ఇంగ్లాండ్​ జట్టు తడబాటుకు గురైంది. తొలి ఇన్నింగ్స్​లో రూట్​ సేన కేవలం 112 పరుగులకు ఆలౌటైంది. ​టీ సమయానికి 81/4తో బ్యాటింగ్​ కొనసాగించిన ఇంగ్లిష్​ టీమ్​.. మరో 31 పరుగులు చేసి కుప్పకూలింది. స్పిన్​కు సహకరిస్తున్న 'మోదీ' పిచ్​పై భారత బౌలర్లు పండగ చేసుకున్నారు.

ఇంగ్లిష్​ జట్టు బ్యాటింగ్​ ఆర్డర్​ పేకమేడను తలపించింది. ఓపెనర్​ జాక్​ క్రావ్లే మినహా ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. టీ విరామం అనంతరం అదే స్కోరు వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. పోప్​ను అశ్విన్​ ఔట్​ చేయగా.. బెన్​ స్టోక్స్​ను అక్షర్​ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆర్చర్​ వికెట్​ మ్యాచ్​కే హైలైట్​. భారత బౌలర్లలో అక్షర్​ పటేల్​ 6, అశ్విన్​ 3 వికెట్లు తీసుకున్నారు.

ఇదీ చదవండి: అక్షర్​ బౌలింగ్​కు మాస్టర్​ బ్లాస్టర్​ ఫిదా

Last Updated : Feb 24, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.