ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. వెస్డిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసి.. దిగ్గజ ఆల్‌రౌండర్ల జాబితాలో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో స్టోక్స్‌కు ఇది పదో సెంచరీ. 17 ఫోర్లు, రెండు సిక్సర్లతో 176 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో (499-9)తో జట్టుకు మార్గ నిర్దేశం చేశాడు. టెస్టుల్లో స్టోక్స్ 150కిపైగా పరుగులు చేయడం ఇది రెండోసారి. ఈ ఫార్మాట్లో 150 వికెట్లతోనూ సత్తాచాటుతున్నాడీ ఆటగాడు. ఈ సందర్భంగా భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్ట్రోక్స్‌కు అభినందనలు తెలిపాడు.

స్టోక్స్ కాకుండా ఈ జాబితాలో మాజీ వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్, మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బోథమ్, టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి, మాజీ ప్రోటీస్ దిగ్గజం కలిస్ ఉన్నారు.

టెస్టుల్లో 4000 పరుగులు, 150 వికెట్లు తీసిన రెండో ఫాస్టెస్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సాధించాడు స్టోక్స్.
ఇదీ చూడండి:3టీ క్రికెట్ కప్: స్వర్ణం సాధించిన డివిలియర్స్ జట్టు