ETV Bharat / sports

నాల్గో టెస్టుకు ఆర్చర్​ దూరమైంది ఇందుకే...

author img

By

Published : Mar 5, 2021, 10:48 AM IST

భారత్​తో చివరి టెస్టుకు జోఫ్రా ఆర్చర్​ను తుది జట్టులోకి తీసుకోకపోవడానికి కారణం చెప్పింది ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు. కుడి మోచేతి సమస్య కారణంగానే అతడు టెస్టుకు దూరమయ్యాడని వెల్లడించింది.

ECB reveals reason behind exclusion of Archer from fourth Test
'మోచేతి సమస్య వల్లే ఆర్చర్​ చివరి టెస్టులో ఆడట్లేదు'

భారత్​తో చివరి టెస్టుకు జోఫ్రా ఆర్చర్​ దూరం అయ్యేందుకు కారణాన్ని చెప్పింది ఇంగ్లాండ్​ అండ్ వేల్స్​ క్రికెట్​ బోర్డు. జోఫ్రా కుడి మోచేతి సమస్య వల్లే నాల్గో టెస్టులో ఆడట్లేదని వెల్లడించింది.

"జోఫ్రా ఆర్చర్​ కుడి మోచేతి సమస్య కారణంగా ఈ టెస్టులో అతడు బరిలోకి దిగట్లేదు. వైద్య బృందం నుంచి అప్డేట్​ రావాల్సి ఉంది. ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​తో సహా మరికొందరు ఆటగాళ్లు అతిసారం వ్యాధితో బాధపడుతున్నారు" అని ఇంగ్లాండ్​ బోర్డు ప్రకటించింది.

స్టోక్స్​ డయేరియాతో బాధపడుతున్నాడని బోర్డు తెలిపినప్పటికీ.. తుది జట్టులో అతడికి చోటు దక్కింది. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అతడు అర్ధ సెంచరీతో రాణించాడు. బెయిర్​ స్టో, ఒల్లీ పోప్​తో కలిసి జట్టుకు అవసరమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్​ క్రికెటర్లకు డయేరియా.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.