ETV Bharat / sports

'యువ ఆటగాళ్లు రాణించడానికి ద్రావిడే కారణం'

author img

By

Published : Jan 22, 2021, 2:58 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన యువ ఆటగాళ్లపై రాహుల్​ ద్రావిడ్​ ప్రభావం ఉందన్నాడు క్రికెటర్​ ఇంజమాముల్​ హక్​. వారిని మానసికంగా దృఢంగా చేశాడని కొనియాడాడు. ది వాల్​ ను పొగుడ్తూ చేసిన వీడియోను యూట్యూబ్​లో పోస్ట్​ చేశాడు.

Dravid made India's young players mentally tough: Inzamam-ul-Haq
'యువ ఆటగాళ్ల రాణింపు వెనుక ద్రావిడ్​ ఉన్నాడు'

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో రాణించిన యువ ఆటగాళ్ల ప్రదర్శనపై.. పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​ ఇంజమాముల్​​ హక్​ స్పందించాడు. జట్టుపై, ఇండియా మాజీ కెప్టెన్​ రాహుల్ ద్రావిడ్ ప్రభావముందని ​తెలిపాడు. రిషభ్​ పంత్​, శుభ్​మన్ గిల్​, మహమ్మద్​ సిరాజ్​లు మెరుగైన ప్రదర్శన చేయడంలో అతని పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించాడు. ది వాల్​ ను పొగుడ్తూ మాట్లాడిన వీడియోను ఇంజమామ్​.. తన యూట్యూబ్​ ఛానల్​లో పోస్ట్​ చేశాడు.

అండర్​-19 నుంచి భారత్​-ఏ కు, అక్కడి నుంచి జాతీయ జట్టులోకి ఆ యువ ఆటగాళ్ల ప్రస్థానం సాగింది. వారు క్రికెట్​లో రాణించడానికి రాహుల్​ ద్రావిడే కారణమని తెలుసుకున్నాను. అతని బలమేంటనేది అతడి 'ది వాల్'​ పేరే చెబుతుంది. ఏ పరిస్థితిలోనైనా ఆడగల సత్తా అతని సొంతం. మానసికంగా దృఢమైన వ్యక్తి. తనని తాను సర్దుబాటు చేసుకోగలడు. ఈ యువ ప్లేయర్లనూ.. రాహుల్ తనలాగే​ మానసికంగా దృఢంగా తయారు చేశాడు.

-ఇంజమాముల్​ హక్, పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​.

ద్రావిడ్​ కోచ్​గా 2016, 2019 అండర్​-19 వరల్డ్​ కప్​లు జరిగాయి. పంత్​, వాషింగ్టన్​ సుందర్, గిల్​, పృథ్వీ షాలు వాటిల్లో పాల్గొన్నారు. సిరాజ్​, సైని, విహారి, అగర్వాల్​లు.. ఇండియా-ఏ తరఫున ఆడిన సమయంలో 'ది వాల్​' దగ్గర మెలకువలు నేర్చుకున్నారు.

"తొలి టెస్టు ఓటమి తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లాడు. నలుగురు ప్లేయర్లు గాయపడిన మెల్​బోర్న్​ టెస్ట్​ గెలిచింది ఇండియా. ఈ వ్యూహం వెనుక ద్రావిడ్​ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా వారు ఆడేలా వారికి శిక్షణ ఇచ్చాడు" అని పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు కరోనా సెగ- నిర్బంధంలోనే ఆటగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.