ETV Bharat / sports

'దేశవాళీ టోర్నీలు ప్రారంభమయ్యేది అప్పుడే'

దేశంలో కరోనా తగ్గి సురక్షిత ప్రయాణాలు ప్రారంభమయ్యే వరకు దేశవాళీ క్రికెట్​ జరగదని స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. యువ ఆటగాళ్ల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు.

ganguly
గంగూలీ
author img

By

Published : Jul 9, 2020, 2:03 PM IST

Updated : Jul 9, 2020, 2:35 PM IST

దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రయాణాలు సాగుతున్నప్పుడే దేశవాళీ క్రికెట్​ జరుగుతుందని స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. ఎందుకంటే దేశంలో ఈ మ్యాచ్​ల కోసం యువఆటగాళ్లు అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుందని.. ఈ క్రమంలో వారు వైరస్​ బారిన పడే అవకాశం ఉందన్నాడు. వారి భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు.

"దేశవాళీ టోర్నీ​లు కరోనా తగ్గుముఖం పట్టాకే జరుగుతాయి. ముఖ్యంగా జూనియర్ క్రికెట్​లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుత పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఈ మ్యాచ్​ల కోసం యువఆటగాళ్లు అధికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో వైరస్​ ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారిని కాపాడటం మా బాధ్యత."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ఈ ఏడాది జరగాల్సి ఉన్న రంజీ ట్రోఫీ, దులీప్​ ట్రోఫీ, సయద్​ ముస్తక్​ అలీ ట్రోఫీ, విజయ్​ హజారే ట్రోఫీ అన్నీ కరోనా తగ్గుముఖం పట్టాకే ప్రారంభంకానున్నాయి. గత సీజన్​లో ఇరానీ కప్​ జరిగే నాటికి లాక్​డౌన్​ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ దేశవాళీ టోర్నీ రద్దయింది.

ఇది చూడండి : ధోనీ రిటైర్మెంట్​పై అతడి మేనేజర్​ ఏమన్నాడంటే?

Last Updated : Jul 9, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.