ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. ఇందులో కొందరు ఆటగాళ్లు బౌలింగ్‌తో.. మరికొందరు బ్యాటింగ్‌తో రాణిస్తారు. కానీ కొందరు ఆటలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. విభిన్న బ్యాటింగ్ శైలితో కనిపిస్తారు. వీరు బౌలర్లను తికమకపెడుతూ బ్యాటింగ్ చేస్తుంటారు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్, విండీస్ మాజీ క్రికెటర్ చంద్రపాల్ ఈ కోవకు చెందినవారే. అలాంటి వారిలో మరికొందరు మీకోసం.
1.శివనారాయణ్ చంద్రపాల్
వెస్టిండీస్ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ విభిన్న బ్యాటింగ్ శైలితో మైదానంలో అలరించేవాడు. ఈ విండీస్ బ్యాట్స్‌మన్ 1994లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో మొత్తం 164 టెస్టులు ఆడిన చంద్రపాల్ 51.37 సగటుతో 11,867 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధికం 203 నాటౌట్. మొత్తం 268 వన్డేలు ఆడి 41.60 సగటుతో 8,778 పరుగులు సాధించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2.జార్జ్ బెయిలీ
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ క్రికెట్‌లో విచిత్రమైన బ్యాటింగ్ పొజిషన్‌ని కనిపెట్టాడు. అతడి ఆటను చూసిన అభిమానులు తికమక చెందారు. 2016లో చివరిసారి ఆసీస్ తరఫున ఆడిన అతడు అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియా, విక్టోరియా జట్ల మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో అరుదైన బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. టస్మానియా జట్టుకు చెందిన బెయిలీ 25వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. వికెట్ కీపర్ వైపు నిల్చొని కనిపించాడు. అయితే ముఖం మాత్రం సాధారణ స్థితిలో ఉంచడం గమనార్హం. బౌలర్ బంతిని విసరగానే సహజపద్ధతిలోకి మారి, ఆ బంతిని షాట్ ఆడాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. గ్లెన్ ఫిలిఫ్స్
న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఆడిన ఓ షాట్ ఇదే తరహాలోనిది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫోర్డ్ ట్రోఫీలో అతడు ఆక్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో వినూత్న రీతిలో అతడు బ్యాట్‌ను వెనక్కితిప్పి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఒటాగోపై ఆక్లాండ్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్లెన్ ఫిలిఫ్స్ (156, 135 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) సాధించాడు.
-
Name this shot 👇 pic.twitter.com/lf0uyje5sU
— ICC (@ICC) November 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Name this shot 👇 pic.twitter.com/lf0uyje5sU
— ICC (@ICC) November 27, 2019Name this shot 👇 pic.twitter.com/lf0uyje5sU
— ICC (@ICC) November 27, 2019
4.క్రెగ్ మెక్ మిలన్
న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్.. తనదైన విభిన్న బ్యాటింగ్ శైలితో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో షేన్ వార్న్ వేసిన బౌలింగ్‌లో క్రెగ్ ఆడిన తీరు అందర్నీ మెప్పించింది. వికెట్లకు అడ్డుగా నిలబడి ఆడిన తీరు ఆ మ్యాచ్‌లో వీక్షకులను నవ్వించింది. 1997లో క్రికెట్లోకి అడుగుపెట్టిన క్రెగ్ మెక్‌మిలన్.. 197 వన్డేలు ఆడి 4,707 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 49 వికెట్లు తీశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. డగ్లస్ మరిల్లియర్
జింబాబ్వేకు చెందిన ఈ క్రికెటర్... వికెట్లను మొత్తం వదిలి ఆడేవాడు. ఇతడి పేరుతోనే మరిల్లియర్ షాట్ వచ్చింది. 2000 నుంచి 2003 మధ్య 48 వన్డేలు ఆడి 672 పరుగులు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. అభిషేక్ నాయర్
భారత్‌కు చెందిన ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్.. సగం వరకు కూర్చున్నట్లుగా ఉండటం అతడి ప్రత్యేకత. ఐపీఎల్లో ముంబయి తరఫున ఆడిన ఇతడు.. విభిన్న బ్యాటింగ్ శైలితో అభిమానులను అలరించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 103 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 5 వేల749 పరుగులు చేశాడు.
7. ఫవాద్ ఆలం....
పాకిస్థాన్ క్రికెటర్ ఫవాద్ ఆలం కూడా విండీస్ ఆటగాడు చంద్రపాల్ తరహాలో బ్యాటింగ్ చేసేవాడు. కాళ్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చి.. వికెట్లకు అడ్డంగా వస్తాడీ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్. చూసేందుకు ఇతడి బ్యాటింగ్ శైలి విభిన్నంగా ఉన్నప్పటికీ.. బౌలర్ చేతిలో నుంచి బంతి పడే దృశ్యాన్ని చూసేందుకు వీలుగా ఉంటుంది. అయితే ఇతడు ఎక్కువ కాలం పాక్ జట్టులో ఆడలేకపోయాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: సయ్యద్ మోదీ టోర్నీలో శ్రీకాంత్ ఔట్... సెమీస్‌లో సౌరభ్