మూడో టీ20లో సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. కెరీర్లో తొలిసారి ఇలాంటి సందర్భంలో బ్యాటింగ్ చేయడంపైనా మాట్లాడాడు హిట్‌మ్యాన్. మ్యాచ్ కోసం సిద్ధమయ్యే సమయంలో తన వస్తువులు వెతుక్కోవడానికి ఐదు నిమిషాలు పట్టిందని చెప్పుకొచ్చాడు.
" బ్యాటింగ్ అవగానే నా వస్తువులన్నీ బ్యాగులో సర్దేసుకున్నా. అందుకే సూపర్ ఓవర్ ముందు నా అబ్‌డామిన్ గార్డ్ వెతికేందుకు ఐదు నిమిషాలు పట్టింది. కివీస్ బ్యాటింగ్‌ను చూస్తే సూపర్ ఓవర్ గురించి ఆలోచనే రాలేదు. వారు సులభంగా మ్యాచ్ గెలుస్తారని అనిపించింది. సూపర్ ఓవర్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడంపై సాధనేమీ ఉండదు. అదే బౌలర్‌కైతే ఏ ఓవర్‌నైనా ఒకేలా ఉంటుంది. నేను 60 పరుగులు చేయకుంటే నా బదులు శ్రేయస్ లేదా మరొకరు వచ్చేవారు. సౌథీ సవాల్‌గా బౌలింగ్ చేశాడు. తొలిసారి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా బౌలర్‌పై ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రశాంతంగా బ్యాటింగ్ చేశా. చివర్లో క్రీజులోనే ఉండాలా? ముందుకొచ్చి ఆడాలా? అన్న ఆలోచనలు వచ్చాయి. అతడు నా పరిధిలో బంతులు వేయడంతో చితకబాదాను"
-- రోహిత్‌శర్మ, భారత జట్టు ఓపెనర్
షమి వేసిన ఆఖరి ఓవర్ ఎంతో కీలకంగా మారిందని అభిప్రాయపడ్డాడు రోహిత్." నా సిక్సర్లు కాదు నిజానికి షమి బౌలింగే విజయం అందించింది. మంచు కురుస్తున్నప్పుడు 9 పరుగుల్ని కాపాడటం కష్టం. కేన్ విలియమ్సన్ (95) అద్భుతంగా ఆడాడు. బహుశా వారి జట్టు నిరాశపడి ఉంటుంది. కానీ మేం పుంజుకున్నాం. ఆఖరి వరకు ఆశలు వదులుకోలేదు" అని రోహిత్ చెప్పాడు.
-
Ian smith + super over
— Suspended user (@vk18o) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
HITAM 10 RUNS FROM 2 ..
SIX SIX ..GAME OVER SERIES OVER 😭😭❤#INDvNZ #hitman #RohitSharma pic.twitter.com/3d4X5aR6QZ
">Ian smith + super over
— Suspended user (@vk18o) January 29, 2020
HITAM 10 RUNS FROM 2 ..
SIX SIX ..GAME OVER SERIES OVER 😭😭❤#INDvNZ #hitman #RohitSharma pic.twitter.com/3d4X5aR6QZIan smith + super over
— Suspended user (@vk18o) January 29, 2020
HITAM 10 RUNS FROM 2 ..
SIX SIX ..GAME OVER SERIES OVER 😭😭❤#INDvNZ #hitman #RohitSharma pic.twitter.com/3d4X5aR6QZ
కోహ్లీసేన నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సమం చేసింది. సూపర్ ఓవర్లో 17 పరుగులు లక్ష్యం ఇచ్చింది న్యూజిలాండ్. అయితే విజయానికి భారత్ ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా రోహిత్ వరుస సిక్సర్లో చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ డ్రెసింగ్ రూం నుంచి పరుగెత్తుకొచ్చి.. హిట్‌మ్యాన్‌ను వాటేసుకోవడం నెట్టింట వైరల్‌గా మారింది.
-
BROTHERHOOD 😎😍 @ImRo45 #RohitSharma #Hitman pic.twitter.com/JdGnXoxgoc
— ITS V!SHAL !! 😎 (@Rohitified) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">BROTHERHOOD 😎😍 @ImRo45 #RohitSharma #Hitman pic.twitter.com/JdGnXoxgoc
— ITS V!SHAL !! 😎 (@Rohitified) January 29, 2020BROTHERHOOD 😎😍 @ImRo45 #RohitSharma #Hitman pic.twitter.com/JdGnXoxgoc
— ITS V!SHAL !! 😎 (@Rohitified) January 29, 2020