ETV Bharat / sports

విజయాల సారథి.. రికార్డుల రారాజు మహేంద్రుడు

టీమ్​ఇండియా తరఫున తనదైన ముద్ర వేసిన ధోనీ.. తన కెరీర్​లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. విజయవంతమైన కెప్టెన్, వన్డేల్లో అత్యధిక స్టంపింగ్​లు, 100కు పైగా వన్డేల్లో సారథి​గా జట్టును గెలిపించడం, 200 సిక్స్​లు కొట్టిన తొలి భారత బ్యాట్సమన్​గా నిలడమే కాకుండా మరెన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు.

Dhoni records  speial story
వికెట్​ కీపరే కాదు.. రికార్డుల మహేంద్రుడు ధోనీ
author img

By

Published : Aug 15, 2020, 8:56 PM IST

16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్​గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

అపద్భాందవుడు ధోనీ

బ్యాటింగ్ చేయగల వికెట్‌ కీపర్ దొరక్క రాహుల్ ద్రవిడ్‌పై అదనపు భారం మోపి లాక్కొస్తున్న రోజులవి. పార్థివ్ పటేల్‌, అజయ్‌రాత్రాల లాంటి వచ్చివెళ్లే వాళ్లు తప్ప స్థిరత్వం ఉన్న కీపర్ బ్యాట్స్‌మెన్‌ దొరకడం లేదు. అలాంటప్పుడు 2004లో టీమిండియా తలుపు తట్టాడు ధోనీ. అనతికాలంలోనే నమ్మదగ్గ కీపర్‌గా, భరోసా ఉంచదగిన బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. జట్టులోకి వచ్చిన మూడేళ్లలోపే సారథిగా మారి, దశాబ్దం పాటు ముందుండి నడిపించాడు.

వన్డేల్లో అత్యధిక స్టంపింగ్​లు ధోనీవే

2004 డిసెంబర్ 23న తొలి వన్డే ఆడాడు ధోని. మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో దాదాపు 51 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 6 ఓవర్లు బౌలింగ్‌ చేసి, ఓ వికెట్ కూడా తీశాడు. ఈ ఫార్మాట్​లో 321 క్యాచ్‌లు పట్టి, 123 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా ఉండే ఈ కీపర్.. 444 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. ఈ ఫార్మాట్​లో అత్యధిక స్టంపింగ్‌ల రికార్డు ధోనీ పేరిటే ఉంది.

ఆ రికార్డు సాధించిన తొలి భారత కెప్టెన్

200 వన్డేలకు కెప్టెన్సీ వహించిన ధోనీ.. 110 విజయాలు సాధించాడు. తద్వారా 100కు పైగా వన్డే మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన ఏకైక ఆస్ట్రేలియేతర సారథిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ తర్వాత 10వేల పరుగుల మైలురాయి అందుకున్న 4వ భారతీయ క్రికెటర్‌, రెండో వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.

ఏకైక బ్యాట్స్​మన్ మహీనే

మొత్తం కెరీర్‌లో 50 సగటుతో 10 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ధోనీనే. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 4,031 పరుగులు చేశాడు. ఏడులో దిగి సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్​గా రికార్డు సృష్టించాడు. ఈ స్థానంలోనే రెండు శతకాలు చేశాడు. వన్డేల్లో 82 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్​లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు.

అదే అత్యుత్తమ భాగస్వామ్యం

2005లో శ్రీలంకపై ధోనీ చేసిన 183 పరుగులు ఓ వికెట్ కీపర్‌కు అత్యధిక పరుగులు. అదే జట్టుపై ధోనీ- భువనేశ్వర్.. 8వ వికెట్‌కు నెలకొల్పిన 100 పరుగుల భాగస్వామ్యమే ఆ వికెట్‌కు భారత్‌ తరఫున అత్యధికం.

వికెట్ కీపర్.. 200 వన్డేలకు సారథ్యం

ఓ వికెట్‌ కీపర్ దాదాపు 200 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రికార్డు ధోనీదే. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు. మహీ కెప్టెన్సీలోనే భారత్.. 2011 వన్డే ప్రపంచ విజేతగా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది.

సొంతగడ్డపై ఎక్కువ.. విదేశాల్లో తక్కువ

2005 డిసెంబర్‌ 2న టెస్టు అరంగేట్రం చేశాడు ధోనీ. తన పదేళ్ల కెరీర్‌లో 90 టెస్టులు ఆడాడు. 4 వేల 876 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్​లో అతడి అత్యధిక స్కోరు 224. 60 టెస్టుల్లో కెప్టెన్​గా 27 విజయాలు అందించాడు. 15మ్యాచ్‌లు డ్రాగా ముగిస్తే, 18 మ్యాచ్​ల్లో భారత్‌ ఓడింది.

2009లో ధోనీ ఉన్నప్పుడే భారత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సంపాదించింది. సొంతగడ్డపై ఎక్కువ విజయాలు అందుకున్నాడు. విదేశాల్లో మాత్రం అత్యధిక పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా సారథిగా నిలిచాడు. టెస్టుల్లో 4వేల పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోనీనే. ఈ ఫార్మాట్​లో 38 స్టంపింగులు చేశాడు మహీ. టెస్టుల్లో ఇదే అత్యధికం.

వికెట్​ కీపింగ్​లో ధోనీ ఓ నమూనా

2006లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడాడు ధోని. మొత్తంగా 98 టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. 73 మ్యాచ్​లకు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తించాడు. అందులో 41 విజయాలు, 28 అపజయాలు ఉన్నాయి.

అయితే వికెట్ కీపింగ్‌లో ధోనీ.. క్రికెట్‌ ప్రపంచానికి ఓ నమూనాగా నిలిచాడని ఇంగ్లండ్ క్రికెటర్లు బట్లర్‌, స్టోక్స్ చెప్పడం అతడి ప్రతిభకు నిదర్శనం. ఆరు టీ20 ప్రపంచకప్‌లలో కెప్టెన్‌గా పాల్గొన్న మహీ.. 2007లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

ఇది చూడండి అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.