ఐపీఎల్ 12వ సీజన్లో హార్దిక్ పాండ్య తనదైన శైలి ఆటతో రెచ్చిపోతున్నాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. హెలికాప్టర్ షాట్‌తోనూ అలరిస్తున్నాడీ యువ ఆటగాడు. ధోనీ ఈ షాట్‌కు ఆద్యుడనీ అందరికీ తెలిసిందే. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మహీ ముందే ఆ షాట్ ఆడి ఆశ్చర్యపరిచాడు. తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే షాట్ ఆడి ఆకట్టుకున్నాడు.
-
Don't take a timeout, enjoy this sweeeeet Hardikcopter 🚁#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #DCvMI https://t.co/1j4iZckF4U
— Mumbai Indians (@mipaltan) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Don't take a timeout, enjoy this sweeeeet Hardikcopter 🚁#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #DCvMI https://t.co/1j4iZckF4U
— Mumbai Indians (@mipaltan) April 18, 2019Don't take a timeout, enjoy this sweeeeet Hardikcopter 🚁#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #DCvMI https://t.co/1j4iZckF4U
— Mumbai Indians (@mipaltan) April 18, 2019
20 ఓవర్ రబాడా బౌలింగ్‌లో రెండో బంతిని హెలికాప్టర్ షాట్ ద్వారా సిక్సుగా మలిచాడు పాండ్య. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 32 పరుగులు (3 సిక్సులు, రెండు ఫోర్లు) సాధించి ముంబయి 168 పరుగుల చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
"హెలికాప్టర్ షాట్ ఆడతానని అనుకోలేదు. ఆ షాట్ కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నా. ధోనీ గదికి వెళ్లి నా హెలికాప్టర్ షాట్ నచ్చిందా అని అడిగా. అందుకు మహీ.. బాగా ఆడావు అని మెచ్చుకున్నాడు. తర్వాత మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నా".
పాండ్య, ముంబయి ఇండియన్స్ ఆటగాడు
ఈ సీజన్ లో 194 స్ట్రైక్ రేట్‌తో 218 పరుగులు సాధించాడీ ముంబయి ఆటగాడు.