ETV Bharat / sports

ముంబయి చేరిన దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లు - క్రిస్ వోక్స్

రానున్న ఐపీఎల్​ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ముంబయికి చేరుకుంటున్నారు. టీమ్​​ఇండియా యువ క్రికెటర్​ రిషభ్ పంత్​తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్​ బిల్లింగ్స్​, టామ్​ కరన్​, కోచ్ రికీ పాంటింగ్, బౌలింగ్​ కోచ్ జేమ్స్​ హోప్స్​ జట్టుతో కలిశారు.

Delhi Capitals' Ashwin, Axar, Woakes assemble in Mumbai
ఐపీఎల్​ సందడి షురూ.. ముంబయిలో డీసీ ఆటగాళ్లు
author img

By

Published : Mar 29, 2021, 4:13 PM IST

Updated : Mar 29, 2021, 9:05 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం దిల్లీ క్యాపిటల్స్​(డీసీ) ఆటగాళ్లు ఒక్కొక్కరు ముంబయికి చేరుకుంటున్నారు. తాజాగా టీమ్​ఇండియా యంగ్ క్రికెటర్​ రిషభ్​ పంత్​, ఇంగ్లాండ్​ ఆటగాళ్లు సామ్​ బిల్లింగ్స్​, టామ్​ కరన్​ డీసీ జట్టుతో పాటు చేరారు. డీసీ హెడ్​ కోచ్ రికీ పాంటింగ్​, బౌలింగ్ కోచ్ జేమ్స్​ హోప్స్​ కూడా స్క్వాడ్​తో కలిశారు. ఈ విషయాన్ని దిల్లీ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది.​

అంతకుముందు సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​తో పాటు ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​, పేసర్​ క్రిస్​ వోక్స్​, బ్యాట్స్​మన్​ హెట్మేయర్​ తమకు కేటాయించిన హోటల్లో కలిశారు. బీసీసీఐ కొవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో వీరంతా 7 రోజులు తప్పనిసరి క్వారంటైన్​లో ఉండనున్నారు. ఈ సీజన్​లో దిల్లీ తమ తొలి మ్యాచ్​ను వాంఖడే మైదానంలో​ ఏప్రిల్ 10న చెన్నై సూపర్​ కింగ్స్​తో ఆడనుంది. ​

కాగా, ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో అశ్విన్-అక్షర్​ల ద్వయం అద్భుత ప్రదర్శన చేసింది. అత్యధిక వికెట్లను తమ ఖాతాలో వేసుకుంది. భుజం గాయం కారణంగా డీసీ కెప్టెన్ శ్రేయస్​ అయ్యర్.. ఐపీఎల్​కు దూరమయ్యాడు. ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్​లో పాల్గొన్న క్రికెటర్లు మినహా మిగతా వారందరికీ వారం రోజుల క్వారంటైన్​ను తప్పనిసరి చేసింది బీసీసీఐ.

ఇదీ చదవండి: టీమ్​ఇండియా విజయాల హ్యాట్రిక్.. ప్రశంసలే ప్రశంసలు

Last Updated : Mar 29, 2021, 9:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.