ETV Bharat / sports

బీసీసీఐకి ఎదురుదెబ్బ.. రూ.4800 కోట్లు జరిమానా! - డెక్కన్​ ఛార్జర్స్​ కేసులో విజయం

ఐపీఎల్​లో ఒకప్పటి ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. బొంబాయి కోర్టులో వేసిన ఓ కేసు వల్ల బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యానికి రూ. 4,800 కోట్లు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

bcci
బీసీసీఐ
author img

By

Published : Jul 18, 2020, 6:56 AM IST

ఒకప్పటి ఐపీఎల్‌ జట్టు డెక్కన్‌ ఛార్జర్స్‌ (డీసీ) యాజమాన్యం వేసిన కేసులో బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యాజమాన్యం డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌)కు రూ.4,800 కోట్లు చెల్లించాలని.. బొంబాయి హైకోర్టు నియమించిన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీకే టక్కర్‌ బీసీసీఐని ఆదేశిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు.

deccan
డెక్కన్​ ఛార్జర్స్​

ఐపీఎల్‌ ఆరంభ జట్లలో ఒకటైన డీసీని 2012లో లీగ్‌ నుంచి బీసీసీఐ తొలగించింది. ఓ జాతీయ బ్యాంకు నుంచి బీసీసీఐకి రూ.100 కోట్ల పూచీకత్తు ఇవ్వడంలో డీసీహెచ్‌ఎల్‌ విఫలమైందనే కారణంతో ఆ జట్టుపై వేటు వేశారు. దాని స్థానంలో మరో జట్టు కోసం బిడ్లను ఆహ్వానించగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం ఆ అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే లీగ్‌ నుంచి తమ జట్టును చట్ట విరుద్ధంగా తొలగించారని డీసీహెచ్‌ఎల్‌ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారించేందుకు కోర్టు జస్టిస్‌ సీకే టక్కర్‌ను నియమించింది. 8 ఏళ్లుగా సాగిన విచారణ అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా డీసీహెచ్‌ఎల్‌కు బీసీసీఐ రూ.4,800 కోట్లు పరిహారంగా చెల్లించాలని తీర్పు వచ్చింది. దీనిపై హైకోర్టులో బీసీసీఐ సవాలు చేసే అవకాశం ఉంది.

ఇది చూడండి : 'మా వ్యూహం ఫలించింది.. టీమ్​ఇండియా గెలిచింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.