టీమ్ఇండియాతో నిర్ణయాత్మక పోరులో ఇంగ్లాండ్ ఓడిపోయింది. 2-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. కానీ ఆ జట్టులో ఉన్న ప్రపంచ నం.1 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో కోహ్లీ, బాబర్ ఆజమ్‌లను అధిగమించాడు.
శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో(68) ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మలన్.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 టీ20 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకోగా.. బాబర్ ఆజమ్(26), కోహ్లీ(27) ఇతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఏప్రిల్ జరగబోయే ఐపీఎల్.. మలన్‌కు తొలి సీజన్. ఇందులో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇతడిని రూ.1.5 కోట్లు పెట్టి వేలంలో సొంతం చేసుకుందీ ఫ్రాంచైజీ.
ఇవీ చదవండి: