ETV Bharat / sports

ఈసారి 'రాములో రాములా'.. వార్నర్ తగ్గట్లేదుగా! - David Warner TikTok latest news

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి టిక్​టాక్ వీడియోతో మెరిశాడు. 'అల వైకుంఠపురములో'లోని 'రాములో రాములా' పాటకు చిందేసి ఫ్యాన్స్​ను ఫిదా చేశాడు.

వార్నర్
వార్నర్
author img

By

Published : May 12, 2020, 6:31 PM IST

లాక్​డౌన్ పుణ్యమా అని తమ కొత్త ప్రతిభను చాటుతున్నారు క్రికెటర్లు. టిక్​టాక్ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే తన స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా తెలుగు పాటలకు అతడి ఫ్యామిలీ కాలు కదపడం ఫ్యాన్స్​ను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే బుట్టబొమ్మ సాంగ్​తో పాటు పోకిరిలోని ఓ డైలాగ్​ టిక్​టాక్ చేసిన వార్నర్ తాజాగా రాములో రాములా పాటకు చిందేశాడు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఇప్పటికే పూరీ జ‌గ‌న్నాథ్ అయితే వార్న‌ర్ న‌ట‌నకు మెచ్చి త‌న సినిమాలో ఓ పాత్ర చేయాల‌ని కోరాడు. క్రికెట్ లేక‌పోవ‌డం వల్ల టిక్‌టాక్‌తో కాల‌క్షేపం చేస్తున్న వార్న‌ర్ మరిన్ని పాటలతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.