ఐసీసీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలిచిన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ రెండు పురస్కారాలకు అతడు అర్హుడని తెలిపాడు. ఎవరేమన్నా తమ తరంలో అత్యుత్తమ ఆటగాడు అతడేనని స్పష్టం చేశాడు. విరాట్‌కు వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు.
ఐసీసీ పురస్కారాల్లో కోహ్లీ దుమ్మురేపాడు. ఈ దశాబ్దపు వన్డే ఆటగాడు, ఈ దశాబ్దపు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ పురుష క్రికెటర్ పురస్కారాలను సొంత చేసుకున్నాడు. అలాగే ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా అతడిపై అనేకమంది అభిందనల జల్లు కురిపిస్తున్నారు. వార్నర్ కూడా వారితో జత కలిశాడు. విరాట్ కోహ్లీ వీడియోకు తన ఫేస్‌స్వాప్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. "ఈ దశాబ్దపు ఆటగాడిని ఎవరూ గుర్తుపట్టలేరు. విరాట్ కోహ్లీకి అభినందనలు. నువ్వో సీరియస్ ఆటగాడివి. ఈ పురస్కారాలకు అర్హుడివి" అని వ్యాఖ్య జత చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">