ETV Bharat / sports

మిల్లర్​ సిక్స్​.. చూపు కోల్పోయిన పోలీస్​ అధికారి! - మిల్లర్ రాజస్థాన్ రాయల్స్

2015 ఐపీఎల్​లో తాను కొట్టిన సిక్స్​ వల్ల ఓ పోలీస్​ అధికారి కంటికా గాయమైందని, అతడు చూపు కూడా కోల్పోయాడని చెప్పాడు డేవిడ్ మిల్లర్. కానీ ప్రస్తుత సీజన్​లో ప్రేక్షకులు ఉండరు కాబట్టి అలాంటివి జరగవని తెలిపాడు.

David Miller recalls his six that blinded an Indian cop in one eye
డేవిడ్ మిల్లర్
author img

By

Published : Aug 30, 2020, 5:36 AM IST

ఐపీఎల్​​ కోసం సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్​మన్ డేవిడ్ మిల్లర్.. 2015 సీజన్​లో జరిగిన విషాద సంఘటనను గుర్తుచేసుకున్నాడు. తాను కొట్టిన సిక్స్​ వల్ల భారత్​లోని ఓ పోలీస్​ అధికారి ఓ కన్నుకు దెబ్బ తగిలి, చూపు కోల్పోయాడని అన్నాడు. ఈ ఘటన కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్​కతా నైట్​రైడర్స్ మ్యాచ్​ సందర్భంగా జరిగింది.

అదే సీజన్​లో కొన్ని మ్యాచ్​ల తర్వాత కూడా మిల్లర్ కొట్టిన మరో సిక్స్​.. మ్యాచ్​ చూసేందుకు వచ్చిన సిద్ధార్థ్ అనే పిల్లాడి ఛాతీపై బలంగా తగిలింది. వెంటనే ఆ చిన్నారి సృహ తప్పిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా కోలుకున్నాడు. మీడియా, వార్త పత్రికల ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నానని మిల్లర్ చెప్పాడు.

David Miller recalls his six that blinded an Indian cop in one eye
డేవిడ్ మిల్లర్

"నేను కొట్టిన సిక్స్​ వల్ల పోలీస్ అధికారి ఓ కంటికి గాయమైంది. అది చూసి చూపు కోల్పోయాడనుకుంటాను. ఈ విషయం మీడియా, వార్తాపత్రికల ద్వారా తెలిసింది. అయితే ఈ సీజన్​లో​ మాత్రం ప్రేక్షకులు ఎవరూ ఉండరు కాబట్టి, అలాంటి సంఘటనలు ఏం జరగవు. వాళ్లు లేకుండా ఆడాలన్నా చాలా కష్టమే. చూద్దాం ఏం జరుగుతుందో?" -డేవిడ్ మిల్లర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్

ప్రస్తుత సీజన్​ భారత్​ బదులు దుబాయ్​లో నిర్వహించడం సహా జనాలు లేకుండానే మ్యాచ్​లు జరగనున్నాయి. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్.. నవంబర్ 10 జరిగే ఫైనల్​తో ముగుస్తుంది. గత సీజన్​లో పంజాబ్​కు ఆడిన మిల్లర్.. ఈసారి రాజస్థాన్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.