ETV Bharat / sports

పునరాగమనంలోనే స్టెయిన్ రికార్డు - SA vs ENG 1st T20

దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఓ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో బట్లర్ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

స్టెయిన్
స్టెయిన్
author img

By

Published : Feb 13, 2020, 5:17 PM IST

Updated : Mar 1, 2020, 5:39 AM IST

దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్‌ స్టెయిన్‌ పొట్టి క్రికెట్‌లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో బట్లర్‌(15)ను ఔట్‌ చేసిన అతడు ఆ జట్టు తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ 35 మ్యాచ్‌ల్లో 61 వికెట్లు తీయగా.. స్టెయిన్‌ 44 మ్యాచ్‌ల్లో ఆ మార్కును సమం చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం తాహిర్‌ను అధిగమించిన స్టెయిన్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక మోర్నే మోర్కెల్‌ 46 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

మొత్తంగా ఈ జాబితాలో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ 106 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. షాహిద్‌ అఫ్రిది(96), షకిబ్‌ అల్‌ హసన్‌(92), ఉమర్ గుల్‌(85) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

స్టెయిన్‌ ఇప్పటికే దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక (439) వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతుండగా ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ ఆ ఘనత సాధించాడు. 2016 నుంచి వరుస గాయాలతో సతమతమవుతున్న అతడు నాటి నుంచి కేవలం ఎనిమిది టెస్టులు, తొమ్మిది వన్డేలు, మూడు టీ20లు మాత్రమే ఆడాడు. అయితే, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని ఉందని స్టెయిన్‌ గతంలోనే వెల్లడించాడు.

Last Updated : Mar 1, 2020, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.