ETV Bharat / sports

దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు సీఈఓ సస్పెండ్​ - కుగాండ్రీ గోవెందర్​ సస్పెండ్

దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు యాక్టింగ్​ సీఈఓ కుగాండ్రీ గోవెందర్​పై సస్పెన్షన్​ వేటు పడింది. ప్రవర్తన సరిగా లేని కారణంగా ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఆ దేశ బోర్డు. దీంతో ఆ పదవిలో చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ ఫొలెసి మోసెకి నియమితులయ్యారు.

Kugandrie Govender
కుగాండ్రీ గోవెందర్
author img

By

Published : Dec 15, 2020, 7:33 AM IST

గత నెలలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యాక్టింగ్​ సీఈఓగా నియమితులైన కుగాండ్రీ గోవెందర్​ సస్పెన్షన్​కు గురయ్యారు. గతంలో ఆమె బోర్డు చీఫ్​ కమర్షియల్​ ఆఫీసర్​గా పనిచేసినప్పడు.. ప్రస్తుత పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పడు ఆమె ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన బోర్డు.. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ ఫొలెసి మోసెకిని ఆ స్థానంలో భర్తీ చేసింది. దీంతో 2020లో మూడో యాక్టింగ్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు ఫొలెసి. మరోవైపు సెక్రటరీ వెల్ష్ గ్వాజా కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.

CSA
దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు

ఇదీ చూడండి : డైరెక్టర్ల రాజీనామా.. దక్షిణాఫ్రికా బోర్డు రద్దు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.