చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మధ్య జరిగిన ప్రపంచకప్ పోరులో టీమిండియా గెలిచింది. ఆ తర్వాత పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు విపరీతమైన విమర్శలు చేయడం ప్రారంభించారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను వ్యక్తిగతంగానూ దూషించారు. దీనిపై స్పందించిన ఈ క్రికెటర్.. విమర్శించండి కానీ దూషణలకు పాల్పడవద్దని కోరాడు.
"దీనిపై నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. విమర్శించేవారిని మేం నియంత్రించలేం. గెలవడం ఓడటం అనేది ఆటలో భాగం. టీమిండియాపై ఓడిన వారిలో మేం మొదటి జట్టు కాదు, గత జట్లు ఇదే ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాయి. సోషల్ మీడియాలో రాతలు, ఇలాంటి ఘటనలు ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. మమ్మల్ని విమర్శించండి కానీ దూషించకండి." - సర్ఫరాజ్ అహ్మద్, పాకిస్థాన్ కెప్టెన్
ఇంతకు ముందు పాక్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, మహమ్మద్ ఆమిర్కూ ఇలాంటి బాధలు తప్పలేదు. ఇలా చేయొద్దని అప్పుడు వారూ అభిమానుల్ని కోరారు. అయినా వినే పరిస్థితుల్లో లేరు పాక్ ఫ్యాన్స్.
ఇది చదవండి: పాక్ సారథి సర్ఫ్రాజ్ ఆవలింతలు... నెట్టింట ట్రోల్