ETV Bharat / sports

బబుల్​లో క్రికెట్.. ఆ దేశ ఆటగాళ్లకు ఇబ్బంది: మిస్బా

బబుల్​లో క్రికెట్ ఆటడం కొనసాగితే పశ్చిమ దేశాలకు చెందిన ఆటగాళ్లకు మానసిక సమస్యలు రావొచ్చని పాక్ కోచ్ మిస్బా అన్నాడు.​

Misbah on playing in bio-bubble
పాక్ కోచ్ మిస్బా ఉల్ హక్
author img

By

Published : Oct 22, 2020, 4:17 PM IST

బయో బబుల్ వల్ల పశ్చిమ దేశాలకు చెందిన క్రికెటర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. ఈ విధానంలో ఆట కొనసాగితే వారికి ఆ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముందని చెప్పాడు.

"బయో బబుల్​లో క్రికెట్ ఇంకా కొనసాగితే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది. అయితే మా(పాక్) క్రికెటర్లు మాత్రం మానసికంగా చాలా ఆరోగ్యవంతులు, బబుల్​కు బాగా అలవాటుపడిపోయారు. ఇదే విధానం ఇంకొన్నాళ్లు ఉంటే పశ్చిమ దేశాలకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది మాత్రం మానసికంగా ఇబ్బంది పడొచ్చు" -మిస్బా ఉల్ హక్, పాక్ ప్రధాన కోచ్

ఆగస్టులో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్.. బయో బబుల్​లోనే సిరీస్​లు ఆడింది. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ కూడా యూఏఈలో ఇదే విధానంలో జరుగుతోంది.

పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్​గా ఇటీవల తప్పుకున్న మిస్బా.. హెడ్ కోచ్​ బాధ్యతలపై పూర్తిగా దృష్టిసారించడమే తన ప్రధాన కర్తవ్యమని అన్నాడు. వైదొలగిన విషయంలో ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.