ETV Bharat / sports

హైదరాబాద్​ క్రికెట్​ బాగుపడేదెన్నడో? - సయ్యద్​ అలీ ముస్తాక్​ ట్రోఫీ

సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ20 టోర్నీని నిర్వహించడానికి భారతీయ క్రికెట్​ నియంత్రణా మండలి (బీసీసీఐ) చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క హైదరాబాద్​ తప్ప దీని కోసం దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. ఐపీఎల్​కు ముందు అత్యంత కీలకమైన టోర్నీ సమయంలోనూ అంతర్గత కుమ్ములాటలతో జట్టు కూర్పులో జాప్యం చేస్తున్నారని హైదరాబాద్​ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు తలో దారిలో వెళ్లిపోతున్నారు.

Cricketers continue to suffer in Hyderabad Cricket Association  bickering
హైదరాబాద్​ క్రికెట్​ బాగుపడేదెన్నడో?
author img

By

Published : Dec 22, 2020, 6:41 AM IST

Updated : Dec 22, 2020, 7:28 AM IST

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20.. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో జరుగనున్న తొలి క్రికెట్‌ టోర్నీ. ఐపీఎల్‌ వేలం పాటకు ముందు ఫ్రాంచైజీలను ఆకర్షించేందుకు దేశవాళీ క్రికెటర్లు సత్తా చాటుకునేందుకు వేదిక. ఇందుకోసం బీసీసీఐ చకచకా ఏర్పాట్లు చేస్తుండగా.. అనుబంధ రాష్ట్ర సంఘాలు జట్ల ఎంపికపై దృష్టిసారించాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. బయో బబుల్‌లో శిక్షణ శిబిరాల్ని మొదలుపెట్టాయి.. ఒక్క హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తప్ప! జట్టు సెలెక్షన్‌.. శిక్షణ శిబిరం సంగతి అటుంచితే కనీసం సెలెక్టర్లను కూడా ఎంపిక చేయకుండా హెచ్‌సీఏ పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఐపీఎల్‌కు ముందు అత్యంత కీలకమైన టోర్నీ సమయంలోనూ అంతర్గత కుమ్ములాటలతో యువ క్రికెటర్ల జీవితాలతో ఆడుకుంటున్నారు.

కరోనాతో దేశంలో పరిస్థితులు బాగాలేకపోయినా.. ఐపీఎల్‌కు ముందు దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ ఫ్రాంచైజీలకు తెలియాలన్న ఉద్దేశంతో ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తోంది. బెంగళూరు, కోల్‌కతా, వడోదరా, ఇండోర్‌, ముంబయి, చెన్నైలలో బయో బబుల్‌లు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది జనవరి 10న టోర్నీ ప్రారంభించనుంది. జనవరి 1లోపు అన్ని జట్లు ఆయా వేదికలకు చేరుకోవాలంటూ రాష్ట్ర సంఘాలకు సూచించింది. డిసెంబరు 20 లోపు జట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలంది. అయితే హెచ్‌సీఏ మాత్రం క్రికెట్‌ను గాలికొదిలేసింది. కనీసం సెలెక్టర్లు, కోచ్‌ను కూడా ఎంపిక చేయలేదు. ముస్తాక్‌ అలీకి ముందు టీ20 టోర్నీ లేదా లీగ్‌ నిర్వహించాల్సిన హెచ్‌సీఏ.. చిత్రంగా మూడు రోజుల లీగ్‌ నిర్వహిస్తోంది. అర్హత లేని ఆటగాళ్లను ఆడించి డబ్బు సంపాదించుకోవడమే పరమావధిగా.. గత ఏడాది లీగ్‌లో ఉన్న 19 జట్లను ఈసారి 35కు పెంచినట్లు సొంత సభ్యులే ఆరోపిస్తున్నారు. అందులో సింహభాగం ఎపెక్స్‌ కౌన్సిల్‌లోని సభ్యులు.. వారి అనుయాయులవే. హైదరాబాద్‌ జట్టులో చోటు సంపాదించాలంటే ఈ క్లబ్‌ల తరఫునే ఆడాలి. దీంతో హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా ఈ క్లబ్‌లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దాదాపు రూ.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టి క్లబ్‌లను లీజుకు తీసుకున్న వ్యక్తులు వాటి తరఫున ఆడేందుకు ఆటగాళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.40-50 వేలు డబ్బులు వసూలు చేస్తున్నారన్నది ఆరోపణ. ఇంతా చేస్తే.. ఈ మ్యాచ్‌ల్ని చూసి ఆటగాళ్ల ప్రదర్శనను ఎవరు అంచనా వేయాలి? జట్టును ఎవరు ఎంపిక చేయాలి? సెలెక్టర్లే లేనప్పుడు ఎన్ని లీగ్‌లు నిర్వహిస్తే ఏం లాభం?

ఏజీఎం ఎప్పుడు?

నిరుడు అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన అజహరుద్దీన్‌ సారథ్యంలో ఎపెక్స్‌ కౌన్సిల్‌ ఒక్క పనీ చేయలేదు. వివాదాలకు లోటు లేదు. అజహర్‌ ఒకవైపు.. మిగతా కార్యవర్గ సభ్యులు మరోవైపుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశమవగా.. సుహృద్భావంగా ముగిసిన భేటీ ఒక్కటీ లేదు! అజ్జూ ఒకటి చేద్దామంటే.. మిగతా వాళ్లు మరొకటి సూచిస్తున్నారు. జస్టిస్‌ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా అజ్జూ నియమించగా మిగతా వాళ్లంతా కలిసి ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. ఈనెల 20న ఏజీఎం నిర్వహించాలని కార్యదర్శితో సహా మిగతా వాళ్లు నిర్ణయించగా దాన్ని అజ్జూ వ్యతిరేకించాడు. చెప్పిన మాట వినకపోతే ఈనెల 24న జరిగే బీసీసీఐ ఏజీఎంకు హెచ్‌సీఏ తరఫున మరో వ్యక్తిని సిఫార్సు చేస్తామంటూ మిగతా సభ్యులంతా బెదిరించడం వల్ల అజ్జూ కాస్త తగ్గినట్లుగా చెబుతున్నారు. ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడాలంటే జనవరి 1న హైదరాబాద్‌ జట్టు కోల్‌కతాలో ఉండాలి. అప్పుడే బుడగలోకి అనుమతిస్తారు. అంతర్గత పోరుతో ఆదివారం జరగాల్సిన ఏజీఎం రద్దయింది. నిబంధనల ప్రకారం ఏజీఎం నిర్వహించాలంటే 21 రోజుల నోటీసు తప్పనిసరి. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ), సెలెక్టర్లు, కోచ్‌, అంబుడ్స్‌మన్‌, సీఈఓ తదితరుల్ని ఏజీఎం మాత్రమే ఎంపిక చేస్తుందని కార్యదర్శి విజయానంద్‌ అంటున్నాడు. మరి సీఏసీని ఎప్పుడు ఎంపిక చేస్తారు? సెలెక్టర్లను ఎవరు నియమిస్తారు? కోచ్‌గా ఎవరుంటారు? ఎంపిక చేసిన జట్టుకు శిక్షణ శిబిరం ఎప్పుడు నిర్వహిస్తారు? అన్నవి సమాధానం లేని ప్రశ్నలే. ఇక విజయానంద్‌, సంయుక్త కార్యదర్శి నరేశ్‌శర్మల మధ్య సమన్వయలోపం బయటపడింది. మూడు రోజుల లీగ్‌ కోసం విజయానంద్‌ 22 జట్లను ఎంపిక చేయగా.. నరేశ్‌ మరో 12 జట్లను చేర్చాడు. 216 క్లబ్‌లు ఉన్న హెచ్‌సీఏలో మూడు రోజుల లీగ్‌లో బరిలో దిగే జట్లకు కొలమానం ఏమిటో!

అజహర్‌ వచ్చాక చర్చిస్తాం

"సీఏసీ, సెలెక్టర్లతో సహా ఎవరిని నియమించాలన్నా ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాలి. ఏజీఎం ఆమోదించాలి. ఇప్పటి వరకు ఏజీఎం జరగలేదు. ప్రస్తుతం అధ్యక్షుడు అజహర్‌ బిజీగా ఉన్నాడు. అతనొచ్చాక ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తాం. మూడు రోజుల లీగ్‌లో కొత్తగా రెండు జట్లను మాత్రమే చేర్చా. మిగతా జట్ల ఎంపికలో నా ప్రమేయం లేదు. సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగింది. రూ.5 లక్షలకు జట్టును లీజుకు ఇస్తున్నారన్న విషయం నా దృష్టికి రాలేదు"

- విజయానంద్‌, హెచ్‌సీఏ కార్యదర్శి

ఆటగాళ్లు తలో దారి

హెచ్‌సీఏ పరిపాలన గందరగోళంగా తయారవడం వల్ల ఆటగాళ్లు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. నిరుడు హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబటి రాయుడు ఈసారి ఆంధ్రకు తరలి వెళ్లాడు. పేసర్‌ రవికిరణ్‌ చత్తీస్‌గఢ్‌ వెళ్లిపోయాడు. గోవాకు ఆడాలనుకున్న సందీప్‌ మళ్లీ తిరిగొచ్చాడంటున్నారు. ఇంతకుముందు విహారి ఆంధ్రకు, రాహుల్‌సింగ్‌ సర్వీసెస్‌కు తరలిపోయారు. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న యువరాజ్‌ను పంజాబ్‌.. బీసీసీఐ నిషేధం నుంచి బయటపడిన శ్రీశాంత్‌ను కేరళ అక్కున చేర్చుకుంటుంటే హెచ్‌సీఏ పెద్దలు మాత్రం వెళ్తామన్న వాళ్లను ఆపే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. ఆటగాళ్లంతా వెళ్లిపోతే ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు తమ పిల్లలతో హైదరాబాద్‌ జట్లను నింపేస్తారని క్లబ్‌ల కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: బ్యాడ్మింటన్​ టోర్నీ: 2021 తొలి అర్ధభాగం షెడ్యూల్​

Last Updated : Dec 22, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.