ETV Bharat / sports

ఆసీస్ క్రికెటర్​ సోదరుడికి 30 నెలల జైలుశిక్ష

author img

By

Published : Nov 5, 2020, 4:22 PM IST

సహోద్యోగ్యులపై ఉగ్రవాద ఆరోపణలు మోపిన ఆస్ట్రేలియా క్రికెటర్​ ఉస్మాన్​ ఖవాజా సోదరుడికి 30 నెలల జైలుశిక్ష విధించారు. ఈ మేరకు కోర్టు గురువారం తీర్పును వెల్లడించింది.

Khawaja's
ఉస్మాన్​ ఖ్వాజా

ఆస్ట్రేలియా క్రికెటర్​ ఉస్మాన్​ ఖవాజా సోదరుడు(అన్నయ్య) అర్స్​లాన్​ తారిఖ్​ ఖవాజాకు జైలుకు వెళ్లనున్నాడు. ఉగ్రదాడి ప్రణాళిక రచిస్తున్నారని సహోద్యోగులుపై నకిలీ ఆరోపణలు చేసినందుకే అక్కడి కోర్టు శిక్ష విధించినట్లు తెలుస్తోంది.

ఇదీ కథ?

న్యూ సౌత్​ వేల్స్​ యూనివర్సిటీలో తారిఖ్ ఖవాజా పనిచేసేవాడు. ఆ సమయంలో తనకు, సహోద్యోగికి ఓ​ స్నేహితురాలు ఉండేది. ఆ అమ్మాయి తనతో కాకుండా అతడితో సన్నిహితంగా ఉంటుందని తెలిసి ఈర్ష్య పెంచుకున్నాడు తారిఖ్​. 2017లో ఓసారి పోలీసులకు ఫోన్​ చేసి వారిద్దరూ ఉగ్రదాడికి ప్రణాళిక రచిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. విదేశాల్లో ఉగ్రశిక్షణ కూడా పొందారని చెప్పాడు. అనంతరం 2018లో సదరు వ్యక్తి పుస్తకంలోనూ టెర్రరిజంకు సంబంధించిన రాతాలు రాసి.. వారిపై నకిలీ ఆరోపణలు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాన పోలీసులు.. తారిఖ్​ను నిందుతుడిగా అనుమానించి అప్పటినుంచి అతడిని జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే గురువారం నేరం తానే చేసినట్లు తారిఖ్​ ఒప్పకోగా, 30 నెలలపాటు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు గురువారం తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి కోహ్లీ దూకుడుగా ఆడు.. లేదంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.