ETV Bharat / sports

'బుట్టబొమ్మ' పాటకు వార్నర్ దంపతులు స్టెప్పులు - butta bomma song dance by david warner

బన్నీ 'బుట్టబొమ్మ' పాటకు ఆసీస్ స్టార్ క్రికెటర్ వార్నర్, తన భార్యతో కలిసి డ్యాన్స్​ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

'బుట్టబొమ్మ' పాటకు వార్నర్ దంపతులు స్టెప్పులు
బుట్టబొమ్మ పాటకు వార్నర్
author img

By

Published : Apr 30, 2020, 1:38 PM IST

యూట్యూబ్​లో ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్​తో ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్ తెచ్చుకుంది 'బుట్టబొమ్మ' పాట. 'అల వైకుంఠపురములో' సినిమాలో ఈ గీతానికి, దేశంతో సంబంధం లేకుండా చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సాంగ్​కు డ్యాన్స్​ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇప్పుడు లాక్​డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఈ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేయగా, దీనికి స్పందించిన హీరో అల్లు అర్జున్.. అతడికి ధన్యవాదాలు తెలిపాడు. ఇదే వీడియోను సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టూ పోస్ట్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.