సౌరభ్ గంగూలీ సారథ్యంలో మహేంద్రసింగ్ ధోనీ ఎక్కువ మ్యాచులు ఆడుంటే దాదా మరిన్ని ట్రోఫీలు గెలిచేవాడని దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. తన వరకు సుదీర్ఘ ఫార్మాట్లో దాదా, వన్డేల్లో మహీ మెరుగైన బ్యాట్స్‌మెన్ అని తెలిపాడు. నాయకులుగా ఇద్దరి మధ్య ప్రధానమైన తేడా ఆటగాడిగా మహీనే అని వెల్లడించాడు.
"‘దాదా సారథ్యానికి మహీ సారథ్యానికి ప్రధానమైన తేడా ఆటగాడిగా మహీనే. మిడిలార్డర్‌లో నిలవడం, ఆటను ముగించడం, ప్రశాంతంగా ఆడటం అతడి ప్రత్యేకత. అతడిలాంటి ఆటగాడు దాదా జట్టులో ఉండుంటే టీమ్‌ఇండియాను అతడు మరింత దృఢంగా మార్చేవాడు. గంగూలీ ఎక్కువ ట్రోఫీలు గెలవడం చూసేవాళ్లం. అయితే, ఆస్ట్రేలియా జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో గంగూలీ ఆడటం గమనార్హం. అప్పట్లో ట్రోఫీలన్నీ కంగారూలవే కదా" "
- స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ సారథి.
దీంతోపాటు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, సారథి బాధ్యతలు సంక్లిష్టమని అన్నాడు స్మిత్. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే మహీ కన్నా దాదా అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు.
ఇది చూడండి : ఇంగ్లాండ్-భారత్ ద్వైపాక్షిక సిరీస్ వాయిదా!