ETV Bharat / sports

క్రికెట్ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్ - క్రికెట్ బెట్టింగ్ వార్తలు

ఉత్తరప్రదేశ్​ కాన్పూర్​లో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జరిపిన తనిఖీల్లో ఈ ముఠాను పట్టుకున్నారు.

Cricket betting racket busted in Kanpur; 6 held
క్రికెట్ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్
author img

By

Published : Sep 12, 2020, 5:04 PM IST

ఉత్తరప్రదేశ్​ కాన్పూర్​లో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి క్యాష్ కౌంటింగ్ యంత్రం, 11 మొబైల్స్, ఒక ల్యాప్​టాప్​తో పాటు 93 లక్షల నగదులు స్వాధీనం చేసుకున్నారు.

"ఈ గ్యాంగ్ వాట్సప్ ద్వారా బెట్టింగ్​లకు పాల్పడుతోంది. మ్యాచ్​ అయిపోయాక నగదు లావాదేవీలను జరుపుతున్నారు. కాన్పూర్​లోని మొత్తం ఐదు స్థానాల్లో తనిఖీలు చేశాం. నిందితుల నుంచి నేపాలీ కరెన్సీ కూడా లభించింది" అని కాన్పూర్ డీఐజీ ప్రీతిందర్ సింగ్ తెలిపారు.

ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలు జోరుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.