ETV Bharat / sports

''పెర్త్​'ను ఎంపిక చేయకపోవడానికి కారణం అదే'

author img

By

Published : May 30, 2020, 9:21 AM IST

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ కోసం పెర్త్​ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్​ రాబర్ట్స్​ స్పందించాడు. మ్యాచ్​లకు స్టేడియాల ఎంపిక విధానమనేది రొటేషన్​ ప్రకారం ఆధారపడి ఉంటుందని అన్నాడు.

Cricket Australia chief explains why Perth missed out on hosting India Test
'పెర్త్​'ను ఎంపిక చేయకపోవడంపై సీఏ ఛైర్మన్​ వివరణ

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భారత టెస్టుకు పెర్త్​ స్టేడియాన్ని వేదికగా ప్రకటించకపోవడంపై క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్​ రాబర్ట్స్​ స్పందించాడు. ఈ విషయంపై బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే వెల్లడించాడు.

Cricket Australia chief explains why Perth missed out on hosting India Test
భారత్​ vs ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​ (పాత చిత్రం)

"ఎనిమిదేళ్లలో మొత్తం ఇంగ్లాండ్ ఆడిన నాలుగు​ టెస్టులకు, భారత్ ఆడిన రెండు టెస్టులకు పెర్త్​ ఆతిథ్యమిచ్చింది. ఇప్పటివరకు బ్రిస్బేన్ కేవలం రెండింటికి​ మాత్రమే వేదికైంది. దీన్ని సమానం చేసేందుకు టీమ్​ఇండియా​తో ఆడే తొలి టెస్టును బ్రిస్బేన్​లో నిర్వహించాలని భావించాం. వేదికల ఎంపిక అనేది​ పర్యటనల ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. క్రీన్స్​లాండ్​లోని క్రికెట్​ అభిమానులకు దృష్టిలో ఉంచుకొని ఉన్నతస్థాయి టెస్టు మ్యాచ్​లను నిర్వహిస్తామని భరోసా ఇచ్చాం. ఆ స్టేడియానికి ప్రేక్షకుల రాక మరింత పెరుగుతుందని ఊహించే, ఈ నిర్ణయం తీసుకున్నాం"

-- కెవిన్​ రాబర్ట్స్​, క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ

ఆసీస్​ పర్యటనలో భాగంగా భారత్​, నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడనుంది. ఇందులో భాగంగా డిసెంబరు 3 నుంచి గబ్బా, అడిలైడ్​, మెల్​బోర్న్​, సిడ్నీలలో మ్యాచ్​లు జరగనున్నాయి. మరోవైపు పెర్త్​ మైదానాన్ని భారత్ పర్యటన కోసం వేదికగా ప్రకటించనందుకు పశ్చిమ​ ఆస్ట్రేలియన్​ క్రికెట్​ అసోసియేషన్​ (డబ్ల్యూఏసీఏ) ఛైర్మన్​ టక్​ వాల్ట్రాన్​ అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రికెట్​ ఆస్ట్రేలియా నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి... విరాట్ కోహ్లీ ఉగ్రరూపం దాల్చిన వేళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.