ETV Bharat / sports

వెస్టిండీస్​-ఆస్ట్రేలియా టీ20 సిరీస్​ వాయిదా - AUS vs WI

కరోనా వ్యాప్తి కారణంగా వెస్టిండీస్​తో జరగాల్సిన టీ20 సిరీస్​ను వాయిదా వేసింది ఆస్ట్రేలియా బోర్డు. ఇదే కారణంతో ఇప్పటికే టీ20 ప్రపంచకప్​ను వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Cricket Australia announces postponement of T20I series against Windies
వెస్టిండీస్​తో టీ20 సిరీస్​ వాయిదా వేసిన ఆస్ట్రేలియా
author img

By

Published : Aug 4, 2020, 11:39 AM IST

ఈ అక్టోబరులో వెస్టిండీస్​తో జరగాల్సిన టీ20 సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. దీనికి విండీస్​ బోర్డు కూడా అంగీకరించింది.

"టీ20 ప్రపంచకప్​ ముందు వెస్టిండీస్​తో మూడు టీ20​లు ఆడేందుకు షెడ్యూల్​ చేశాం. కానీ, కరోనావ్యాప్తి, టీ20 ప్రపంచకప్​ వాయిదాతో ఈ సిరీస్​ను వాయిదా వేయాలని నిర్ణయించాం" అని ఆస్ట్రేలియా బోర్డు చెప్పింది.

టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేస్తూ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) ప్రకటన చేసింది. దీంతో సెప్టెంబరులో ఇంగ్లాండ్​తో మూడు వన్డేలు, మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్​ను ప్లాన్ చేసింది ఆస్ట్రేలియా. మరోవైపు అదే నెల 19 నుంచి ఐపీఎల్​ను యూఏఈలో జరిపేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.