ETV Bharat / sports

ట్రాన్స్​జెండర్ల క్రికెట్​కు ఆసీస్​ శ్రీకారం..! - New Transgender Policy in cricket

క్రికెట్​ చరిత్రలో తొలిసారి సరికొత్త విధానం ప్రవేశపెట్టనుంది ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు. ఆటలో లింగ భేదం లేకుండా చేసి... ట్రాన్స్​జెండర్లకు అవకాశం కల్పించాలని యోచిస్తోంది. ఈ సంచలన నిర్ణయంపై ముందడుగు వేయాలనుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది ఆసీస్​ క్రికెట్​.

ఆస్ట్రేలియా క్రికెట్​ టీమ్
author img

By

Published : Aug 8, 2019, 5:48 PM IST

క్రికెట్​లో ట్రాన్స్​జెండర్లకు అవకాశం కల్పించే విధంగా ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు అడుగులు వేయనుంది. ఈ విషయాన్ని గురువారం ఆ దేశ​ క్రీడా విభాగం తెలిపింది. ఆటలో లింగభేదం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగానే దేశ క్రికెట్​ బోర్డు నియమాల్లో మార్పులు చేయాలనుకుంటోంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)నీ సంప్రదించనున్నట్లు పేర్కొంది.

"క్రికెట్​లో ఎలాంటి లింగ భేదం ఉండకూడదు. అంతర్జాతీయ, జాతీయ టోర్నీల్లో మరింత నిష్పాక్షికంగా ఆట​ జరగాలని కోరుతున్నాం. ట్రాన్స్​జెండర్లకు అవకాశం కల్పించి వారిని క్రికెట్​లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నాం."
-- ఆసీస్​ క్రికెట్​ బోర్డు ప్రతినిధి.

ఈ తాజా నిర్ణయాన్ని ఆ దేశ మహిళా క్రికెటర్​ మేగనా స్కట్​ అభినందించింది. సరికొత్త విధానానికి ఆసీస్ తొలి అడుగు వేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

" ఎటువంటి లింగ భేదం లేకుండా ఆటలో అందరికీ చోటు దక్కాలి. అందరూ ఈ విధానానికి మద్దతిస్తారని ఆశిస్తున్నా."
-- మేగనా స్కట్​, ఆసీస్​ మహిళా క్రికెటర్​

ఆసీస్​ బోర్డు వార్షిక సమావేశంలో ఈ విధానంపై చర్చ జరిగింది. ఒక వేళ అమలులోకి వస్తే ఇది క్రికెట్​లో సంచలన, చారిత్రక నిర్ణయం కానుంది.

ఇదీ చూడండి: ఐసీసీ నిషేధం ఉన్నా ట్రైసిరీస్​లో జింబాబ్వే

Intro:Body:

v

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.